ములాయంను అనొద్దంటే..: అధిష్టానానికి బేణి వార్నింగ్!

అధిష్టానం మందలింపును బేణి లెక్కకు తీసుకోవడం లేదట. ములాయంను ఏమీ అనవద్దని అంటే తాను ఊరుకోనని, అవసరమైతే పార్టీని వీడేందుకు సైతం సిద్ధంగా ఉన్నానని హెచ్చరించారు. ములాయంపై వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేయవద్దని అధిష్టానం హితవు పలికింది. అయితే ములాయం పైన విమర్సలు చేయవద్దంటే ఊరుకోనని, ఆయనను ఏమీ అనవద్దని చెప్పినా సహించేది లేదని చెబుతున్నారు.
రెండు రోజుల క్రితం ములాయం పైన బేణి నిప్పులు చెరిగారు. ములాయం ప్రధానమంత్రి కావాలనుకుంటున్నారని, అతను మొదట ప్రధానమంత్రి హౌస్‌లో ఊడ్చే ఉద్యోగం కోసం ప్రయత్నించాలని ఎద్దేవా చేశారు. ఆయన ప్రధానమంత్రి హౌస్‌లో కింది స్థాయి పోస్టుకు కూడా పనికి రాడని వ్యాఖ్యానించారు. దీనిపై ఎస్పీ మండిపడింది. కాంగ్రెసు బేణిని మందలించింది. కానీ ఆయన మాత్రం తగ్గేది లేదంటున్నారు.
నాలుగు నెలల క్రితం సభలో ములాయం, బేణిల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. 2002 గోద్రా అల్లర్ల తర్వాత గుజరాత్‌లో బిజెపి అధికారంలోకి ఎస్పీ సహకరించిందని బేణి అప్పుడు ఆరోపించారు. దానిపై సమాజ్ వాది పార్టీ మండిపడింది.












Click it and Unblock the Notifications