వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరాయికి రేపిస్టులు: పశ్చిమ బెంగాల్ మంత్రి వ్యాఖ్య

By Pratap
|
Google Oneindia TeluguNews

Opposition has hired rapists: Bengal minister
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ జలవనరుల మంత్రి సౌమెన్ మహాపాత్ర సంచలన ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడానికి ప్రతిపక్షాలు రేపిస్టులకు 20 లక్షల రూపాయలు చెల్లించి, సమాజంలోకి వదిలిపెట్టారని మంత్రి మంగళవారంనాడు ఆరోపించారు.

మూడు రాజకీయ పార్టీల వద్ద విపరీతంగా డబ్బులున్నాయని, మమతా బెనర్జీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డు తగలడానికి రేపిస్టులకు డబ్బులు చెల్లించి వారిని వాడుకుంటున్నాయని మహాపాత్ర అన్నారు. వెస్ట్ మిడ్నాపూర్ కేశియారీలో జరిగిన బహిరంగ సభలో ఆయన ఆ వ్యాఖ్యలు చేసారు. కాముదిని అత్యాచారం - హత్య కేసులోని ప్రధాన నిందితుడు అన్సార్ అలీ సిపిఎం మద్దతుదారుడని ఆయన ఆరోపించారు.

మహాపాత్ర వ్యాఖ్యలపై ప్రతిపక్షాల నాయకులు ధ్వజమెత్తారు. మంత్రిలో ఆలోచనా శక్తి నశించినట్లుందని రాష్ట్ర కాంగ్రెసు అధ్యక్షుడు ప్రదీప్ భట్టాచార్య అన్నారు. రాష్ట్రంలో బుద్ధిలేని ప్రభుత్వ పాలన సాగుతోందని, ఒక్క మంత్రి అటువంటి వ్యాఖ్యలు చేయడమేమిటని అన్నారు.

ప్రతిపక్షాలు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని, తాను బాధితులకు నష్టపరిహారం చెల్లిస్తానంటూ రేపిస్టులు తమ తప్పులను కొనసాగించవచ్చునని ముఖ్యమంత్రి స్వయంగా చెబుతున్నారని బిజెపి అధ్యక్షుడు రాహుల్ సిన్హా అన్నారు. మంత్రి వ్యాఖ్యలను సిపిఎ నాయకుడు ఎండి సలీం తప్పు పట్టారు.

English summary

 Bengal water resources minister Soumen Mahapatra on Tuesday alleged that opposition parties have paid Rs 20 lakh to rapists and unleashed them in the state to block the development under CM Mamata Banerjee.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X