వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిరణ్, బొత్స తెలంగాణకే ఓటేస్తారు: శ్రీధర్ బాబు

By Pratap
|
Google Oneindia TeluguNews

Sridhar Babu
హైదరాబాద్/ తిరుపతి: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగానే ముఖ్యమంత్రి ఎన్ కిరణ్‌కుమార్‌రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ రోడ్డు మ్యాప్ ఇస్తారని భావిస్తున్నట్లు పౌరసరఫరాలశాఖ మంత్రి డి శ్రీధర్‌బాబు చెప్పారు. గురువారం సచివాలయంలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అధిష్టానం సానుకూలంగా ఉందని ఆయన అన్నారు. కాబట్టి, ముఖ్యమంత్రి, పిసిసి అధ్యక్షుడు కూడా అందుకు అనుగుణంగానే నివేదిక ఇస్తారని భావిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)ని కాంగ్రెస్‌లో విలీనం చేయాలనే షరతు ఏమైనా ఉందా అనే ప్రశ్నకు ఆయన స్పందిస్తూ - దీనిపై చర్చ అనవసరమని అన్నారు. తమకు తెలంగాణ సాధనే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

విదేశీయులకు సంబంధించి సౌదీ అరేబియా ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టం అమలును మరో నాలుగు నెలలపాటు వాయిదా వేసిందని ఆయన చెప్పారు. దీనివల్ల సౌదీలో ఉన్న 11,700 మంది తెలుగువారికి కొంత వెసులుబాటు వచ్చిందన్నారు.

నాలుగు నెలల్లో వారందరిని ఇక్కడకు తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తామని ఆయన అన్నారు. చార్‌ధామ్ యాత్రకి వెళ్లిన తెలుగువారిలో ఇప్పటికీ 81 మంది ఆచూకీ తెలియలేదని మంత్రి శ్రీధర్‌బాబు చెప్పారు.

తెలంగాణపై కోర్ కమిటీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని మంత్రి దానం నాగేందర్ చెప్పారు. గురువారం ఉదయం కుటుంబ సమేతంగా దానం శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ప్రజల సంక్షేమం కోసమే అని ఎన్నికల కోసం కాదని దానం తెలిపారు.

English summary

 Minister Sridhar Babu said that CM Kiran kumar Reddy and PCC president Botsa Satyanarayana may submit positive reports on Telangana
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X