హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తమ్ముడ్ని ఆరేళ్లు గృహ నిర్బంధంలో ఉంచిన సోదరులు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Man locked up in room for 6 years
హైదరాబాద్: సొంత తమ్ముడిని ఆరేళ్ల పాటు గృహ నిర్బంధంలో ఉంచిన సంఘటన హైదరాబాదులోని సనత్ నగర్‌లో వెలుగు చూసింది. ఆస్తి కోసమే బాధితుడి అన్నలు నిర్బంధించారనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే తమ్ముడికి మతిస్థిమితం లేక పోవడం వల్లనే గదిలో ఉండిపోయాడని సోదరులు చెబుతున్నారు.

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సనత్ నగర్‌లోని అశోక్‌నగర్‌లో నివాసం ఉండే ఈశ్వరయ్యకు అశోక్, రవిచంద్ర, గోపాల్, లక్ష్మణ్ రావులు కుమారులు. వీరు లక్ష్మణ్ రావును ఏళ్లుగా బయటకు పోనివ్వకుండా ఇంటిలోనే నిర్బంధించి ఉంచుతున్నారు. గురువారం స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న సనత్ నగర్ పోలీసులు ఎందుకు ఇలా బంధించారని ప్రశ్నించారు.

లక్ష్మణ్ రావుకు మతిస్థిమితం సరిగా లేదని గతంలో రెండుసార్లు వివాహం కూడా చేశామని, ఇతని మానసిక పరిస్థితిని తట్టుకోలేకవారు వెళ్లిపోవడంతో తమను మరింత ఆందోళన పెట్టేలా బయటకు పరుగులు చేసేది లేక నిర్బంధించినట్టు పోలీసులకు తెలిపారు. కాని అతనికి ఎలాంటి చికిత్సను అందించకుండా నిర్బంధించడంపై కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.

ప్రియుడి ఆత్మాహత్యా యత్నం

ప్రియురాలి ఇంటి ముందు ఓ ప్రియుడు పెట్రోల్ పోసుకుని ఆత్యాహత్యా యత్నం చేసిన సంఘటన కెపిహెచ్‌బి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ధూల్‌పేటకు చెందిన అశోక్ జస్ఫల్ బెంగుళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. నిజాంపేటకు చెందిన ఓ యువతి కూడా సాఫ్టువేర్ కంపెనీలో పని చేస్తోంది.

గతంలో శంషాబాద్‌లోని ఇంజనీరింగ్ కళాశాలలో అశోక్ జస్ఫల్, సదరు యువతి క్లాస్‌మెట్‌లు. ఇద్దరి మధ్య పరిచయం ప్రేమకు దారితీసింది. చదువు పూర్తయిన ఇద్దరు వేర్వేరుగా ఉద్యోగాలు చేస్తున్నారు. గురువారం అశోక్ అమ్మాయి ఇంటికి వచ్చి ప్రేమ విషయాన్ని లేవనెత్తాడు. అంగీకరించక పోవడంతో ఆత్మహత్యాయత్నం చేశారు.

English summary
In a barbari act, a person was allegedly kept under house arrest for six years by his brothers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X