కోదండరామ్‌కు దొరకని సోనియా అపాయింట్‌మెంట్

'తెలంగాణ సమస్యను సత్వరం పరిష్కరించాల్సిన అవసరం ఉన్నందున అన్ని రాజకీయ పార్టీల నాయకులను కలుసుకోవాలని నిర్ణయించామని, అన్ని పార్టీల నేతలతో ఢిల్లీలో రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఏర్పాటు చేస్తున్నామని, ఈ సందర్భంగా మిమ్మల్ని కూడా కలుసుకోవాలనుకుంటున్నామని,, అవకాశం ఇస్తే, కలిసి, తెలంగాణపై వివరిస్తామని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం కాంగ్రెస్ అధినేత్రి, యూపీఏ చైర్‌పర్సన్ సోనియా గాంధీకి ఒక లేఖ రాశారు.
తెలంగాణ ఉద్యమం, తమ పోరాటాలు, కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, క్షేత్ర స్థాయి పరిస్థితులు, వాస్తవాలను కోదండరామ్ ఆ లేఖలో వివరించారు. అవకాశం ఇస్తే ఒక ప్రతినిధి బృందంగా కలిసి జేఏసీగా తమ వాదన వినిపిస్తామని ఆ లేఖలో వివరించారు.
రౌండ్ టేబుల్ సమావేశం కోసం ఢిల్లీ వెళ్లిన జేఏసీ నేతలు పలువురు ప్రస్తుతం అక్కడే ఉన్నారు. వారు తిరిగి శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ రావటానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఈలోగా సోనియా కార్యాలయం నుంచి ఆహ్వానం అందితే, ఆమెను కలుస్తామని జెఎసి నాయకులు అంటున్నారు.
కాగా, జేఏసీ చైర్మన్ కోదండరాం తనను కలిశారని, కానీ సోనియా గాంధీతో అపాయింట్‌మెంట్‌పై తనను కోరలేదని పిసిసి మాజీ చీఫ్ డి.శ్రీనివాస్ గురువారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. అధిష్ఠానం ఎవరితో మాట్లాడాలో వారితోనే మాట్లాడుతారని ఆయన వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications