వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భోగాలన్నీ తాత్కాలికమే: చంద్రబాబు వేదాంతం

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వేదాంతంలోకి దిగారు. మట్టిలో పుట్టాం, మట్టిలో కలుస్తామని, మధ్యలో వచ్చిన భోగాలన్నీ తాత్కాలికమేనని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని ఆయన అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. రాష్ట్రంలోనే కాదు, దేశంలోనూ తమ పార్టీ చక్రం తిప్పుతుందని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు కాంగ్రెసులో కలుస్తాయని అన్నారు.

తమ పార్టీ కార్యకర్తలకు నీతి, నిజాయితీలు ఉన్నాయని, పార్టీ కోసం ఆస్తులు అమ్ముకున్న కార్యకర్తలు ఉన్నారని అన్నారు. శనివారం ఉదయం నగరంలో జరిగిన పార్టీ ప్రాంతీయ సదస్సులో ఆయన ప్రసంగించారు. అధికారం కోసం కొందరు నేతలు తమ పార్టీని వీడారని, ఒక్క కార్యకర్త కూడా పార్టీని వీడలేదని ప్రసంసించారు.

మహానాడును మించి కొంపల్లి ప్రాంతీయ సదస్సు జరిగిందన్నారు. తెలుగుదేశం కుటుంబసభ్యులు తన ప్రాణసమానులన్నారు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేసిన ఘనత కాంగ్రెస్‌కే దక్కుతుందని మండిపడ్డారు. కార్యక్రమం ప్రారంభం ముందు ఉత్తరాఖండ్ వరదబాధితులను పార్టీ సంతాపం ప్రకటించింది.

వరద బాధితులకు రూ.10 లక్షల ఆర్థికసాయం ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం దూరదృష్టితో వ్యవహరించలేదని, ప్రభుత్వం చేయలేని పని తమ పార్టీ చేసిందని చంద్రబాబు చెప్పుకున్నారు. స్థానిక సంస్థలను బలోపేతం చేయడమే తమ పార్టీ లక్ష్యమని ఆయన అన్నారు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గ్రామసభల ద్వారా అధికారులే ప్రజల వద్దకు వెళ్లి సమస్యలు పరిష్కరించే కృషి చేసిందని చెప్పారు.

English summary
The Telugudesam party president Nara Chandrababu has preached philosophy to his partymen.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X