లగడపాటి, రాయపాటిలపై తెలంగాణ ఎంపిలు ఫైర్

Lagadapati Rajagopal and Rayapati Sambasiva Rao
హైదరాబాద్/నల్గొండ: కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు రాయపాటి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్‌లపై ఆ పార్టీ తెలంగాణ పార్లమెంటు సభ్యులు మండిపడ్డారు. రాయపాటిపై పొన్నం ప్రభాకర్ ధ్వజమెత్తగా, లగడపాటిపై గుత్తా సుఖేందర్ రెడ్డి విరుచుకుపడ్డారు. లగడపాటి రాజగోపాల్ రాజకీయ నాయకుడు కాదని, లగడపాటి ఓ వ్యాపారవేత్త అని గుత్తా సుఖేందర్ రెడ్డి శనివారం నల్లగొండలో మీడియా ప్రతినిధులతో అన్నారు.

లగడపాటి రాజగోపాల్ రాజకీయ సన్యాసం తీసుకున్నా పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని ఆయన అన్నారు. కాంగ్రెసు రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్‌తో లగడపాటి భేటీ కావడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణను కృత్రిమ ఉద్యమాలతో సమైక్యాంద్రులు అడ్డుకోవడం సరికాదని గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు.

తమది సీట్లు, ఓట్ల పంచాయితీ కాదని, ఆత్మగౌరవ పోరాటమని ఆయన తెలిపారు. 10 జిల్లాలతో కూడిన తెలంగాణే తమ డిమాండ్ అని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాదుపై సీమాంధ్ర నాయకులు బూటకపు ప్రకటనలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. కృత్రిమ ఉద్యమాన్ని సృష్టించవద్దని ఆయన సీమాంధ్ర నాయకులను కోరారు.

వ్యాపారాల్లోకి వెళ్లడానికే తెలంగాణ ఇస్తే రాజీనామా చేస్తానని సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు అంటున్నారని కాంగ్రెసు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడనివారిపై చర్యలు తీసుకోవాలని ఆయన పార్టీ నాయకత్వాన్ని కోరారు.

సీమాంధ్ర నాయకుల సభలకు అనుమతి ఇవ్వకూడదని ఆయన పార్టీ అధిష్టానాన్ని కోరారు. సీమాంధ్ర నాయకులవి సమైక్యాంధ్ర సభలు కావని, అన్ని ప్రాంతాలవారు కలిస్తేనే సమైక్యమవుతుందని, తెలంగాణవాళ్లు లేకుండా సమైక్యాంధ్ర సభలు ఎలా అవుతాయని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని విభజించి రాజకీయ ప్రయోజనం పొందాలనే ఉద్దేశం కాంగ్రెసు పార్టీకి లేదని శాసనసభ్యుడు జగ్గారెడ్డి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+