గుంటూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దళితుడిని ప్రేమించిందని కూతురిని హత్య చేసిన తండ్రి

By Pratap
|
Google Oneindia TeluguNews

Murder
హైదరాబాద్: దళితుడిని ప్రేమించి, అతన్నే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టిన కూతురి పట్ల తండ్రే కాలయముడయ్యాడు. పరువు కోసం కూతురిని గొడ్డలితో నరికి చంపాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా ఎం వెంకటాయపాలెం గ్రామంలో చోటు చేసుకుంది. కొండా చంద్రయ్య స్వగ్రామంలోనే దుస్తులు కుట్టే పని చేస్తుంటాడు. అతని కూతురు మమత ఖమ్మంలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది.

రెండు రోజులుగా మమత పెళ్లి విషయంలో ఇంటిలో ఘర్షణ జరుగుతూ వస్తోంది. అదే గ్రామానికి చెందిన ఓ దళితుడిని ప్రేమించడం వల్లనే తన కూతురు తాను పది రోజుల క్రితం చూసిన సంబంధాన్ని కాదంటోందని, పెళ్లికి నిరాకరిస్తోందని చంద్రయ్య ఆగ్రహానికి గురయ్యాడు.

శనివారం తెల్లవారు జామున కూడా కూతురు మమతకు, చంద్రయ్యకు మధ్య ఘర్షణ జరిగింది. తీవ్రమైన ఆగ్రహానికి గురైన చంద్రయ్య పక్కన ఉన్న గొడ్డలి తీసుకుని కూతురి తలపై కొట్టాడు. తలపై గాయమై రక్తస్రావం జరగడంతో మమత అక్కడికక్కడే మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. చంద్రయ్య పరారీలో ఉన్నాడు.

రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి

ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం చంద్రు తండా వద్ద శనివారం జరిగిన ఘోర రోడ్డ ప్రమాదంలో నలుగురు మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. లారీ - ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులు వరగంల్ జిల్లా మరిపెడ మండలం విస్సంపల్లి గ్రామానికి చెందినవారు.

తిరుమలాయపాలెం మండలం పాపర్లపాడులో కర్మకాండ కార్యక్రమానికి వెళ్తుండగా వారు ప్రమాదానికి గురయ్యారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఏడేళ్ల బాలుడు ఉన్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకని కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

వృద్ధుడి దారుణ హత్య

ఇదిలావుంటే, గుంటూరు జిల్లా నర్సారావుపేట మండలం అల్లూరివారిపాలెంలో పుల్లయ్య అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. పాతకక్షల కారణంగా పుల్లయ్య అనే వృద్ధుడి తలపై కిరణ్ అనే వ్యక్తి రోకలి బండతో బాదాడు. దీంతో పుల్లయ్య మరణించాడు.

English summary
A person killed her daughter for loving dalith youth in Khammam district. A person jas been murdered in Guntur district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X