వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈగ వాలనీయట్లేదు: జగన్ అంశంలో కిరణ్‌పై టిడిపి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Tummala Nageswara Rao and Gopala Krishna Reddy
హైదరాబాద్: వైయస్ రాజశేఖర రెడ్డి ఆస్తుల పైన ఈగ వాలనీయకుండా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాపాడుతున్నారని తెలుగుదేశం పార్టీ నేతలు తుమ్మల నాగేశ్వర రావు, బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి మంగళవారం ధ్వజమెత్తారు. తృణమూల్ కాంగ్రెసు పార్టీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మకు ఫోన్ చేశారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు చెప్పుకోవడం హాస్యాస్పదమన్నారు.

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో జరిగిన భూకేటాయింపుల పైన ప్రభుత్వం సభా సంఘం ఎందుకు వేయడం లేదని ప్రశ్నించారు. సాధారణ ఎన్నికల తర్వాత కాంగ్రెసు పార్టీకి మద్దతిస్తామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, ఆయన సోదరి షర్మిల, గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ అందరూ చెప్పిన వారేనన్నారు.

అన్ని పంచాయతీలలో నామినేషన్ వేయగలిగే సామర్థ్యం కేవలం టిడిపికే ఉందన్నారు. పంచాయతీ ఎన్నికలలో టిడిపి అవసరమైతే లెఫ్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకొని పోటీ చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా పని చేస్తోందని ఆరోపించారు.

అప్రమత్తంగా ఉండాలి: కోదండ

తెలంగాణ ఏర్పడే వరకు తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాజకీయ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ ఆచార్య కోదండరామ్ వేరుగా పిలుపునిచ్చారు. కాంగ్రెసును పూర్తిగా నమ్మడానికి వీల్లేదన్నారు. ఏదైనా నిర్ణయం జరిగిన వెంటనే రెండు, మూడు రోడ్ మ్యాపులు ఉండవని, అదే అనుమానం కలిగిస్తోందన్నారు.

పంచాయతీ ఎన్నికల్లోపే కాంగ్రెసు తెలంగాణపై తన నిర్ణయాన్ని చెప్పాలన్నారు. పంచాయతీ లేదంటే ఎన్నికల కోసమే డ్రామాలు ఆడుతున్నట్లుగా భావిస్తామన్నారు. తెలంగాణ ఉద్యమ శక్తులనే ఎన్నికల్లో గెలిపించాలన్నారు. త్వరలో జెఏసి గ్రామాల్లో జన చైతన్య యాత్రలు నిర్వహిస్తుందన్నారు.

English summary
Telugudesam Party senior leader Bojjala Gopala Krishna Reddy and Tummala Nageswara Rao said on Tuesday that CM Kiran Kumar Reddy is protecting YSR family's wealth.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X