వైయస్‌ను జైల్లో పెట్టాలనే వాదన: జగన్‌పై ఉండవల్లి

జగన్ రాజకీయాల్లో ఉండడానికి అర్హుడు కాదని ఆయన అన్నారు. అవినీతిలో కూరుకుపోయినవారు రాజకీయాల్లో ఉండకూడదని ఆయన అన్నారు. మంత్రులపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు చేస్తున్న ఆరోపణలు వైయస్ రాజశేఖర రెడ్డి మీద చేసినట్లేనని ఆయన అన్నారు. ఎవరు సంపాదించుకోలేదని అనడం సరైంది కాదని, సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. సంపాదన కోసం వైయస్ రాజశేఖర రెడ్డి రాజకీయాల్లోకి రాలేదని, తాను అందుకే తాను వైయస్‌తో ఉన్నానని ఆయన అన్నారు. వైయస్ అనే బంగారు కోడిని కోసి తిన్నాడని ఆయన జగన్‌పై వ్యాఖ్యానించారు. వైయస్‌ను అప్రతిష్ట పాలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
ఈ ప్రాంతంలోని నాయకుల్లో తనకన్నా సన్నిహితులు వైయస్ రాజశేఖర రెడ్డికి మరెవరూ లేరని ఆయన చెప్పారు. తనకు 1980 నుంచి వైయస్ రాజశేఖర రెడ్డి, కెవిపి రామచంద్ర రావు తనను ఎంతగానో ప్రోత్సహించారని, అవసరానికి మించి వారు తనను ప్రోత్సహించారని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిపై ఒక్క పైసా అవినీతి ఆరోపణ రాలేదని ఆయన చెప్పారు. తన గనులపై విచారణకు ఆదేశిస్తే వైయస్ రాజీనామా చేశారని, ఆ ఆరోపణల నుంచి బయటపడే వరకు ఎంపిగా ఉండడానికి ఇష్టపడలేదని ఆయన అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డిది సహజమరణం కాదని, వైయస్ మరణానికి సోనియా కారణమని ఆరోపించడం తనకు చాలా బాధ కలిగించిందని ఆయన అన్నారు.
వైయస్ జగన్‌పై వచ్చిన అవినీతి ఆరోపణల కారణంగానే 2009లో ఎన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టినా కాంగ్రెసు వైయస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో కాంగ్రెసు అత్తెసరు మార్కులతో గెలిచిందని ఆయన అన్నారు. జగన్ అవినీతి లేకుండా ఉంటే వైయస్ రాజశేఖర రెడ్డి దేశంలో మహా నాయకుడు అయి ఉండేవాడని ఆయన అన్నారు. కలెక్షన్ వేరు, కరప్షన్ వేరని, జగన్ కరప్షన్‌కు పాల్పడ్డారని ఆయన అన్నారు. దేశంలోని పార్లమెంటు సభ్యుల్లో అతి సంపన్నుడైన ఎంపి జగన్మోహన్ రెడ్డి అని ఆయన చెప్పారు. 2009లో జగన్ ఆస్తి 77 కోట్ల రూపాయలు అని, రెండేళ్లలో 2011నాటికి 410 కోట్ల రూపాయలకు పెరిగిందని, అది జగన్ ప్రకటించిన ఆస్తి విలువ అని, ప్రకటించని ఆస్తి ఎంత ఉందో తెలియదని ఆయన అన్నారు.
మాజీ మంత్రి శంకరరావు రాసిన లేఖ మీద కోర్టు జగన్ ఆస్తులపై సిబిఐ విచారణకు ఆదేశిస్తే తప్పేమిటని ఆయన అడిగారు. సిబిఐ దర్యాప్తు తప్పని జగన్ అంటున్నాడని ఆయన అన్నారు. గతంలో జగన్ సిబిఐ విచారణను సమర్థించుకున్నారని ఆయన అన్నారు. సిబిఐ దర్యాప్తును వైయస్ రాజశేఖర రెడ్డి గతంలో సమర్థించారని ఆయన చెప్పారు. పరిటాల రవి హత్య కేసులో ఆరోపణలు వస్తే తాను సిబిఐ విచారణను కోరుతున్నానని జగన్ స్వయంగా చెప్పారని ఆయన అన్నారు. సిబిఐ దర్యాప్తును సమర్థిస్తూ వైయస్ చేసిన ప్రసంగం వీడియోను, సిబిఐ దర్యాప్తు కోరుతున్నట్లు జగన్ చెప్పిన మాటల వీడియోను ఆయన ప్రదర్సించారు.
తన ఖాతాలోకి డబ్బులు ఎలా వచ్చాయో తెలియదని జగన్ అంటున్నారని, అది సరి కాదని ఆయన అన్నారు. దేశంలో చట్టం ఉందని, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని ఆయన అన్నారు. బిల్ క్లింటన్ సరసన కూర్చున్న సత్యం రామలింగ రాజు జైలుకు వెళ్లారని, అత్యంత ఉత్తముడైన సునీల్ దత్ కుమారుడు సంజయ్ దత్ జైల్లో ఉన్నారని ఆయన గుర్తు చేశారు.
చంద్రబాబుపై దుమ్మెత్తి పోసిన ఉండవల్లి
రాష్ట్ర విభజన విషయంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై ఉండవల్లి అరుణ్ కుమార్ దుమ్మెత్తి పోశారు. తెలంగాణకు అభ్యంతరం లేదని చంద్రబాబు చెప్పిన తర్వాతనే ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన నిందించారు. రాజకీయ ప్రయోజనాలు ఆశించి తెలంగాణకు అభ్యంతరం లేదని చంద్రబాబు అన్నారని ఆయన తప్పు పట్టారు.
చంద్రబాబు ప్రకటన ఆందోళనకు గురి చేసిందని ఆయన అన్నారు. తన పాలనలో తెలంగాణను వ్యతిరేకించిన చంద్రబాబు ఇప్పుడు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడడం వెనక రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని ఆయన అన్నారు. రాష్ట్ర విభజన అనేది పార్టీలకు సంబంధించిన వ్యవహారం కాదని ఆయన అన్నారు. తాను తెలంగాణకు వ్యతిరేకం కాదని ఆయన అన్నారు. అలా అంటూనే రాష్ట్ర విభజన హేతుబద్దంగా జరగాలని ఆయన అన్నారు.
-
జగన్ బిగ్ ప్లాన్, 2019 కాంబో రిపీట్ - మారుతున్న లెక్కలు..!! -
జగన్‌కు విజయమ్మ షాక్: నీ చెల్లికి, మేనల్లుడికి అన్యాయం చేశావు -
జగన్ లాంటి అన్న ఉంటే వేరే శత్రువు అవసరం లేదు! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
పల్నాడు, సింహాద్రి ప్రయాణీకులకు రైల్వే గుడ్ న్యూస్, ఇక నుంచి..!! -
3000 ఏళ్ల సంప్రదాయం.. యుద్ధం మధ్యే నూతన సంవత్సరం -
విడాకులపై మెగా డాటర్ "నిహారిక" కామెంట్స్.. అసలు కాంటాక్ట్ కూడా లేదు ?? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
ఏప్రిల్ నెలలో సింహరాశి, కన్యారాశి జాతక ఫలం -
'దురంధర్ 2' ఓ చెత్త సినిమా: స్టార్ హీరోయిన్ -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ












Click it and Unblock the Notifications