విభజిస్తే మెరుపు సమ్మె: ఎపి ఎన్జీవోల హెచ్చరిక

హైదరాబాదులో తాము సమైక్యవాణి వినిపిస్తామని చెప్పారు. తమకూ హక్కులుంటాయని, వెళ్లిపోవాలంటే పోయేది లేదని వారన్నారు. తమపై ఇప్పటికే దాడులు జరుగుతున్నాయని, సమైక్యం కోసం ఇప్పటి వరకు సర్దుకుపోతూ వచ్చామని వారు చెప్పారు. రాజకీయ కోణంతో రాష్ట్రాన్ని విభజించడం సరి కాదని వారన్నారు. విభజనపై తాము అవగాహనా సదస్సు పెడతామని అన్నారు. రాష్ట్ర సమైక్యత కోసం దేనికైనా సిద్ధపడుతామని అన్నారు.
సమైక్యవాదం వినిపించే పార్టీలను తాము సమర్థిస్తామని వారు చెప్పారు. ఉద్యోగులతో బహిరంగ సభ పెడుతామని, తమతో కలిసి వచ్చే పార్టీలను, నాయకులను ఈ సభకు ఆహ్వానిస్తామని అన్నారు. చిన్న రాష్ట్రాల దయనీయ స్థితి చూసి కూడా విభజన కోరడం సరైంది కాదని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే ఎక్కువగా నష్టపోయేది తామేనని అన్నారు. విద్యార్థులు, పెనన్షర్లు కూడా నష్టపోతారని అన్నారు.
రాష్ట్రపతి ఉత్తర్వులకు ముందు హైదరాబాదులోని కొన్ని శాఖల్లో జరిగిన అవకతవకలను చూపి రాష్ట్రాన్ని విభజించాలని కోరడం సరైంది కాదని అన్నారు. విభజన జరిగితే సీమాంధ్ర ఉద్యోగులకు ఏ విధమైన భద్రత కల్పిస్తారనే విషయంపై ఏ విధమైన హామీలు కూడా ఇవ్వలేని వారన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఎవరితోనైనా కలిసి పనిచేస్తామని అన్నారు. విభజన జరిగితే రాజకీయ నాయకులకే ప్రయోజం చేకూరుతుదని అన్నారు. ఎట్టి పరిస్థితిలోనూ రాష్ట్రాన్ని విడిపోనివ్వమని అన్నారు.
ఎపి ఎన్జీవోల సంఘం నాయకుల వాదనలను తెలంగాణ ఎన్జీవోల సంఘం నాయకులు ఖండించారు. సకల జనుల సమ్మె సందర్భంగా ఏ ఒక్కరిపైన అయినా దాడి జరిగినట్లు చూపించగలరా అని అడిగారు. తెలంగాణవాదులను రెచ్చగొడితే పరిణామాలకు ఎపి ఎన్జీవోలు బాధ్యత వహించాల్సి ఉంటుందని సంఘం నాయకుడు శ్రీనివాస గౌడ్ అన్నారు. పరిష్కారం సమయంలో రెచ్చగొట్టడం సరి కాదని ఆయన అన్నారు. సమ్మె చేసుకుంటే వారి ప్రాంతాల్లో చేసుకోవాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications