రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జగన్ పార్టీ వ్యక్తి శ్రీధర్ అరెస్ట్: కొందరిలో కాల్ లిస్ట్ టెన్షన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Sridhar Reddy arrest: fear in some leaders
హైదరాబాద్: తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో సెక్యూరిటీ సంస్థకు చెందిన వ్యక్తిని హత్య చేసి ఏడు కోట్ల రూపాయలకు పైగా ఎత్తుకెళ్లిన కేసులో శ్రీధర్ రెడ్డి అరెస్టైన విషయం తెలిసిందే. అతను నాలుగు నెలల క్రితం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరారు. శ్రీధర్ రెడ్డి అరెస్టు తర్వాత కొందరు నాయకులకు కలవరం ప్రారంభమైందంటున్నారు.

శ్రీధర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేకు అనుచరుడు అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అరెస్టైన శ్రీధర్ రెడ్డితోపాటు ఇతర నిందితుల సెల్‌ఫోన్ కాల్ లిస్టుల ఆధారంగా పోలీసులు ఈ కేసును చాలా వరకు ఛేదించారు. ఎటిఎంలలో సొమ్ము పెట్టే సెక్యూరిటీ ఏజెన్సీ ఇన్‌చార్జి శ్రీనివాస్‌ను హత్య చేసిన తర్వాత నిందితులు ఎవరెవరికి ఫోన్లు చేశారు? ఇక్కడ నుంచి వెళ్లిపోడానికి ఎవరు వాహనాలు సమకూర్చారనే విషయాలను పోలీసులు చేధించారట.

దీంతో శ్రీధర్ రెడ్డి ఫోన్ నుండి కాల్స్ వెళ్లిన వారిలో ఆందోళన ప్రారంభమైందట. హత్య జరిగిన రోజు నిందితులు ఎవరెవరికి టచ్‌లోకి వెళ్లారన్న కోణంలోను పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. శ్రీధర్ రెడ్డి వాంగ్మూలాన్ని, కాల్ లిస్టును బయటపెట్టాలని ఇప్పటికే తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తోంది.

బుధవారం తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి, కాంగ్రెసు పార్టీ సీనియర్ రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దోపిడీ దొంగల పార్టీ అని మండిపడ్డారు. ఇదే సమయంలో రేవంత్.. శ్రీధర్ వాంగ్మూలాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే అవినీతిని కూడా బట్టబయలు చేస్తామన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేరస్తులకు ముఖ్యమంత్రి అండగా నిలబడ్డారని ఆరోపించారు.

English summary
The Telugu Desam has sought action against criminals connected to the YSR Congress. The TD accused the government of taking a lenient view of the criminals identified with the YSRC.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X