గుట్టు విప్పు: చిరంజీవి అల్లుడు శిరీష్‌పై బిజెపి ఒత్తిడి

BJP wants to use Sirish Bharadwaj against Chiranjeevi
హైదరాబాద్: నోరు విప్పాలని, మామకు వ్యతిరేకంగా మాట్లాడాలని బిజెపి నాయకులు కేంద్ర మంత్రి చిరంజీవి అల్లుడు శిరీష్ భరద్వాజ్‌పై ఒత్తిడి పెంచుతున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఏదో మేరకు పాగా వేయాలని భావిస్తున్న బిజెపి నేతలు శిరీష్ భరద్వాజ్‌ను వాడుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. చిరంజీవికి వ్యతిరేకంగా శిరీష్ భరద్వాజ్ నోరు విప్పితే అది తమకు ఉపయోగపడుతుందని వారు భావిస్తున్నారట.

శిరీష్ భరద్వాజ్ ఇటీవల బిజెపిలో చేరిన విషయం తెలిసిందే. తెలంగాణ అంశంతో తెలంగాణ ప్రాంతంలో పాగా వేయాలని వ్యూహరచన చేసిన బిజెపి సీమాంధ్రలో శిరీష్ భరద్వాజ్‌ను వాడుకోవడం ద్వారా కాస్తా ప్రయోజనం పొందవచ్చునని చూస్తోందని అంటున్నారు. మెగా కుటుంబం గురించి శిరీష్ భరద్వాజ్ వివాదం లేపితే అది ఉపయోగపడుతుందని అనుకుంటున్నారట.

తాను ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే బిజెపిలో చేరానని, వివాదం సృష్టించడానికి కాదని శిరీష్ భరద్వాజ్ చెబుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. సామాజిక సేవ ద్వారా, ఉత్తమ రాజకీయాల ద్వారా తానేమిటో నిరూపించుకోవాలనేది తన ప్రయత్నమని, తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడి ప్రయోజనం పొందాలని అనుకోవడం లేదని ఆయన స్పష్టం చేస్తున్నట్లు చెబుతున్నారు.

తనకు రాజకీయాల పట్ల కూడా ఆసక్తి లేదని, అయితే గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీతో ప్రేరణ పొంది రాజకీయాల్లోకి వచ్చానని, మోడీ సిద్ధాంతాలు నచ్చి వచ్చానని శిరీష్ చెబుతున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+