కాంగ్రెస్ తెలంగాణ ఇవ్వకుంటే, ప్రజలే సాధిస్తారు: కెకె

తెలంగాణ ఏర్పాటుకు రాజ్యాంగ సవరణ అవసరం లేదన్నారు. తెలంగాణలోని ప్రజలంతా రాష్ట్ర ఏర్పాటును కోరుకుంటున్నారన్నారు. దిగ్విజయ్ బిజినెస్, బ్యాంకు లోన్ల గురించి మాట్లాడకుండా రాజ్యాంగ సవరణ గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణకు 371డి వర్తించదన్నారు.
గతంలో జార్ఖండ్ రాష్ట్రం ఏర్పాటు చేసినప్పుడు అలాగే జరిగిందన్నారు. రాష్ట్రం ఏర్పాటు చేస్తే 371డి దానంతటదే రద్దవుతుందన్నారు. కాంగ్రెసు పార్టీకి వెయ్యి మంది అమరుల రక్తం అంటుకుందన్నారు. ప్రత్యేక రాష్ట్రాన్ని కాంగ్రెసు పార్టీ ఇవ్వకుంటే మరో పార్టీ ఇస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణకు ప్యాకేజీలు అని ఆలోచిస్తే అది మూర్ఖత్వమే అవుతుందన్నారు. ఆ ఆలోచన చేస్తే వారికంటే మూర్ఖులు మరొకరు లేరన్నారు. కాంగ్రెసు పార్టీ తెలంగాణ ఇవ్వదని, ప్రజలే తెచ్చుకుంటారన్నారు. హైదరాబాదుతో కూడిన పది జిల్లాల తెలంగాణ తప్ప మరొకదానిని అంగీకరించే ప్రసక్తి లేదన్నారు.












Click it and Unblock the Notifications