'టీ'పై కోర్ కమిటీలో చర్చించిన విషయాలు, ప్రశ్నలు

న్యూఢిల్లీ: తెలంగాణపై శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు జరగాల్సిన కాంగ్రెసు కోర్ కమిటీ సమావేశాన్ని నాలుగు గంటలకే నిర్వహిస్తున్నారు. కోర్ కమిటీ సమావేశంలో ఏం జరుగుతుందనేది ఉత్కంఠగా మారింది. ఇటు ఢిల్లీలోనూ అటు హైదరాబాదులోనూ ఉత్కంఠ చోటు చేసుకుంది.

- కోర్ కమిటీ సమావేశం ముగిసిన తర్వాత దిగ్విజయ్ సింగ్ మీడియా ప్రతినిధులతో క్లుప్తంగా మాట్లాడారు. తెలంగాణపై కోర్ కమిటీలో చర్చించిన విషయాలపై వర్కింగ్ కమిటీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

- తెలంగాణపై కార్యాచరణ ప్రణాళికకు సంబంధించి కోర్ కమిటీ సమావేశం ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. తెలంగాణ అంశాన్ని పరిష్కరించాల్సిన అనివార్యతను సమావేశం గుర్తించినట్లు చెబుతున్నారు. అయితే, ఇప్పుడే ఏ విధమైన ప్రకటన వెలువడకపోవచ్చునని అంటున్నారు. కొత్త సమస్యలు తెచ్చుకోకుండా సమస్యను ఏ విధంగా పరిష్కరించాలనే విషయంపై కాంగ్రెసు అధిష్టానం ఆలోచన చేసే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.

Kiran Kumar Reddy

- తెలంగాణపై, వచ్చే సాధారణ ఎన్నికలపై కోర్ కమిటీ సమావేశంలో చర్చ జరిగింది. తెలంగాణ అంశంపై ఏ దిశలో కదిలి రాష్ట్రంలో ఎన్నికలను ఎదుర్కోవాలనే అంశంపై చర్చించారు. రాష్ట్ర నాయకులు తమ రోడ్ మ్యాప్‌లపై వివరిస్తున్నప్పుడు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సందేహాలు తీర్చుకోవడానికి కొన్ని ప్రశ్నలు వేసినట్లు చెబుతున్నారు. గులాం నబీ ఆజాద్ మధ్య మధ్యలో వివరణలు ఇస్తూ వెళ్లారని అంటున్నారు.

- రోడ్ మ్యాపులపై ప్రజంటేషన్ ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ ఎపి భవన్‌కు బయలుదేరి వెళ్లారు. బొత్స సత్యనారాయణ ఢిల్లీలోని తన నివాసానికి వెళ్లిపోయారు. రాష్ట్ర నాయకులు సమావేశం నుంచి వెళ్లిపోయిన తర్వాత అధిష్టానం నేతలు అరగంటపాటు చర్చలు జరిపారు.

- ముగ్గురు రాష్ట్ర నేతలతో కోర్ కమిటీ సమావేశం ఐదు గంటల 50 నిమిషాల వరకు జరిగింది. దాదాపు గంటా యాభై నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది.

- కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణ, దామోదర రాజనర్సింహ తమ తమ రోడ్డు మ్యాప్‌ల ప్రజెంటేషన్‌ను ముగించారు. మొదట దామోదర రాజనర్సింహ, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత బొత్స సత్యనాయణ రోడ్ మ్యాప్‌ల ప్రజంటేషన్ ఇచ్చారు. గంటన్నరకు పైగా కోర్ కమిటీ సమావేశంలో వారు ప్రజంటేషన్స్ ఇచ్చారు.

- కాంగ్రెసు కోర్ కమిటీ సమావేశం సుదీర్ఘంగా సాగుతోంది. విభజన, సమైక్యం రెండే ప్రత్యామ్నాయాలు ఉన్నాయని దిగ్విజయ్ సింగ్ చెప్పినప్పటికీ ఏదైనా సాధ్యం కావచ్చునని అంటున్నారు. కోర్ కమిటీ నిర్ణయం తీసుకుంటుందా అనే అనుమానంగానే ఉందంటున్నారు.

- రాయల తెలంగాణ, సమైక్యం, ప్యాకేజీలు, ప్రత్యేక పాలక మండళ్లు అనే నాలుగు ప్రతిపాదనలపై సమావేశంలో చర్చ సాగుతుందని అంటున్నారు.

- ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సంహ వేర్వేరుగా రోడ్ మ్యాపులను కోర్ కమిటీ సమావేశం ముందు పెట్టారు.

- కేంద్ర ఆర్థిక మంత్రి పి. చిదంబరం కోర్ కమిటీ సమావేశానికి దూరంగా ఉన్నారు. ఆయన అమెరికా పర్యటనలో ఉండడంతో ఈ సమావేశానికి రాలేకపోయారు. సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌ కూడా కోర్ కమిటీ సమావేశంలో ఉన్నారు.

- ప్రధాని నివాసం వద్ద ఉస్మానియా విశ్వవిద్యాలయం జెఎసి నేతలు చేరుకున్నారు. వారు అక్కడ ఆందోళనకు దిగారు. ఒయు జెఎసి, సమైక్యాంధ్ర జెఎసి నేతలను పోలీసులు అరెస్టు చేశారు. ప్లకార్డులతో ఓయు జెఎసి, సమైక్యాంధ్ర జెఎసి నేతలు ఆందోళనకు దిగారు. అదుపులోకి తీసుకునే సమయంలో వారు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు.

- కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే కూడా ప్రధాని నివాసానికి చేరుకున్నారు. కోర్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. రాష్ట్ర విభజన జరిగితే కీలకమైన వ్యవహారాలన్నీ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోనే జరుగుతాయి.

- రక్షణ మంత్రి ఎకె ఆంటోనీ ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసానికి చేరుకున్నారు.

- ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నివాసానికి చేరుకున్నాడు. తెలంగాణపై నిర్ణయం రాహుల్ గాంధీ అభిప్రాయం మీదనే ఎక్కువగా ఆధారపడే అవకాశం ఉంది. వచ్చే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా ముందుకు వస్తుండడంతో ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ స్థానాలు సాధించడానికి వీలుగానే తెలంగాణపై నిర్ణయం ఉంటుందని అంటున్నారు. ఓ వైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ను, మరోవైపు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును ఎదుర్కోవడానికి అనుగుణంగా తెలంగాణపై నిర్ణయం ఉండవచ్చునని అంటున్నారు. కాంగ్రెసు కోర్ కమిటీ సమావేశానికి రాహుల్ గాంధీ హాజరు కావడం ఇదే తొలిసారి.

- ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీగా పనిచేసిన కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్ ప్రధాని నివాసానికి చేరుకున్నారు. దిగ్విజయ్‌తో పాటు ఆజాద్ చెప్పే విషయాలు కూడా తెలంగాణ విషయంలో కీలకం కాబోతున్నాయి.

- కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాష్ట్ర వ్వవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసానికి చేరుకున్నారు.

- ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ ఎపి భవన్ నుంచి ఒకే వాహనంలో ప్రధాని నివాసానికి బయలుదేరారు

- ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సమావేశమయ్యారు.

- ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సాయంత్రం మూడున్నర గంటలకే ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసానికి చేరుకున్నారు.

- ప్రధాని నివాసానికి చేరుకునే ముందు దామోదర రాజనర్సింహకు ఉస్మానియా విశ్వవిద్యాలయం జెఎసి నాయకుడు పిడమర్తి రవి, తదితరులు కత్తి ప్రదానం చేశారు. రుమాలు కూడా ప్రదానం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+