రోడ్ మ్యాప్ ఎన్నికలకే: తెలంగాణపై దిగ్విజయ్ మెలిక

తెలంగాణ సమస్య సున్నితమైనదని, ఇప్పట్లో అది తేలేది కాదని దిగ్విజయ్ స్పష్టం చేశారు. ప్రత్యేక తెలంగాణ అంశం తేలాలంటే దీర్ఘకాలిక కసరత్తు అవసరమని అన్నారు. 2014 లో జరుగనున్న సాధారణ ఎన్నికల కోసమే తాము రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహలను రోడ్ మ్యాప్ అడిగామంటూ గురువారం సాయంత్రం అన్నారు.
రాష్ట్రాన్ని విభజించాలా వద్దా అనే అంశం కోర్ కమిటీ భేటీలో చర్చించడం జరుగుతుందని చెప్పారు. కీలకమైన నిర్ణయం తీసుకోవాలంటే కోర్ కమిటీ నిర్ణయం ముఖ్యమని అన్నారు. ముఖ్యమంత్రి, డిప్యూటి సిఎం, పిసిసి అధ్యక్షులు ఇచ్చిన నివేదికల ఆధారంగా సమైక్యమా, విభజనా అనే అంశంపై నిర్ణయం తీసుకుంటామని, దీనికి కాలపరిమితి ఏమీలేదని ఆయన ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం రాష్ట్రాన్ని విభజించాలంటే రెండో ఎస్సా ర్సీ వైపే మొగ్గు చూపుతుందని తెలియజేశారు.
రెండు వారాల క్రితం హైదరాబాద్‌కు వచ్చిన దిగ్విజయ్‌సింగ్ తెలంగాణపై వారంరోజులలో తేల్చే స్తామని ప్రకటించారు. విభజనపై ఎలాంటి జాప్యం చేయబోమని, రోడ్‌మ్యాప్‌కు సంబంధించిన ప్ర క్రియ కొనసాగుతోందని వివరించారు. వివిధ స్థాయిలలోని రోడ్ మ్యాప్‌లు కేంద్రం పరిశీలనలో వున్నాయని చెప్పిన దిగ్విజయ్ మూడు ప్రాంతాల ప్రజలలో ఉత్కంఠకు తెరలేపారు. దిగ్విజయ్ సింగ్ తాజా వ్యాఖ్యలతో కాంగ్రెసు అధిష్టానం తెలంగాణ అంశాన్ని తేల్చేయడానికి మరో కొలికి పెట్టబోతోందనే అనుమానాలు తలెత్తుతున్నాయి.












Click it and Unblock the Notifications