టిపై తేల్చేదేమీ లేదు: జగన్ పార్టీ, టిఆర్ఎస్ వల్లే: కోడెల

సంతోషిస్తాం: బాజిరెడ్డి
తెలంగాణపై కాంగ్రెసు పార్టీ కోర్ కమిటీ తేల్చేస్తే సంతోషిస్తామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి అన్నారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే స్వాగతిస్తామన్నారు. తమ పార్టీకి చెందిన కడప జిల్లా ఎమ్మెల్యేలు రాయలసీమ విభజన వద్దని రాజీనామా చేశారే కానీ తెలంగాణ ఇవ్వవద్దని చేయలేదన్నారు.
ప్రాణాలతో చెలగాటం: కోడెల
తెలంగాణ రాష్ట్ర సమితి వల్లే రాష్ట్ర ప్రజలకు ఇన్ని కష్టాలు వచ్చాయని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కోడెల శివ ప్రసాద్ అన్నారు. ఆ పార్టీ కొన్నేళ్లుగా ప్రజల మనోభావాలు, ప్రాణాలు, ఆస్తులతో చెలగాటమాడుతోందన్నారు. విభజనను మెజార్టీ ప్రజలు కోరుకోవడం లేదన్నారు. గతంలో తెలంగాణ కోసం మాట్లాడిన నేతలు ప్రజల మద్దతు లేక ఆ తర్వాత కాంగ్రెసు పార్టీలో చేరారన్నారు.
అధిష్టానం నిర్ణయం తెలుస్తుంది: ఆనం
విభజన విషయంలో అధిష్టానం నిర్ణయం కాసేపట్లో తెలుస్తుందని ఆనం అన్నారు. తమ ప్రాంత ప్రజల మనోభావాలను వెల్లడించేందుకే మంత్రులు ఢిల్లీ వెళ్లారన్నారు. అధిష్టానం నిర్ణయం వెలువడ్డాక తమ అభిప్రాయం చెబుతామన్నారు.












Click it and Unblock the Notifications