ఈ నెలలోనే..: టీపై డిగ్గీ, ఆగస్టు 20నుంచి ఆహార భద్రత

Digvijay Singh
న్యూఢిల్లీ: తెలంగాణపై ఈ నెలాఖరులోగానే నిర్ణయం తీసుకోనున్నట్లు కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ చెప్పారు. ఆయన జాతీయ మీడియాతో శనివారం తెలంగాణపై మాట్లాడారు. ఈ నెలాఖరులోగా వర్కింగ్ కమిటీ సమావేశం జరుగుతుందని ఆయన చెప్పారు. తెలంగాణపై నిర్ణయాన్ని వాయిదా వేయదలుచుకోలేదని ఆయన చెప్పారు.

కాగా, పార్లమెంటు సమావేశాలకు ముందు తెలంగాణపై రెండు, మూడు ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించనున్నట్లు ఎఐసిసి ప్రతినిధి ఒకరు చెప్పారు. సంప్రదింపులు ముగిశాయని దిగ్విజయ్ సింగ్ శనివారం ఉదయం చెప్పిన విషయం తెలిసిందే. రెండు ఉన్నత స్థాయి సమావేశాలు అంటే, యుపిఎ, సిడబ్ల్యుసి సమావేశాలుగా భావిస్తున్నారు.

తెలంగాణపై ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించి, కాంగ్రెసు పార్టీపరంగా ఓ నిర్ణయం తీసుకున్న తర్వాత పార్లమెంటులో చర్చకు పెట్టాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆగస్టు రెండోవారం లేదా మూడో వారంలో పార్లమెంటు సమావేశాలు జరిగే అవకాశం ఉంది. ఈలోగా సిడబ్ల్యుసి సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణపై కచ్చితమైన నిర్ణయం తీసుకునే ఆలోచనలో కాంగ్రెసు అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది.

ఆగస్టు 20 నుంచి ఆహారభద్రత

ఆహార భద్రతా చట్టం ఆగష్టు 20 నుంచి అమలు కానుంది. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా తొలత కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఈ చట్టాన్ని అమలు చేయాలని యూపీఏ నిర్ణయించింది. ఆహార భద్రతా బిల్లు ఆవశ్యకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు సోనియా సూచించారు.

శనివారం ఉదయం ఆహార భద్రత బిల్లుపై సోనియా గాంధీ నివాసంలో ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సీడబ్ల్యూసీ సభ్యులు, సీఎల్పీ నేతలు అన్ని రాష్ట్రాల కాంగ్రెస్ ముఖ్యమంత్రులు హాజరయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+