జగన్ పార్టీలోకి వెళ్లేవారే వ్యతిరేకిస్తున్నారు: టీపై పొన్నం

తెలంగాణకు వ్యతిరేకమని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కోర్ కమిటీ సమావేశంలో చెప్పినా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పడం సంతోషమని ఆయన అన్నారు. తెలంగాణపై సిడబ్ల్యుసి సభ్యుడు సంజీవ రెడ్డి ఏం చెబుతారో చూడాల్సి ఉందని ఆయన అన్నారు. తెలంగాణ ఇస్తే నక్సలైట్లు పెరుగుతారని చెప్పడం కాంగ్రెసు పార్టీకి ద్రోహం చేయడమేనని ఆయన అన్నారు.
వైయస్ జగన్ అవినీతిని తెలంగాణను వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర నాయకులు ఎందుకు ఎండగట్టలేకపోయారని ఆయన అడిగారు. యాభై ఏళ్ల నుంచి తాము బాధపడుతున్నామని, ఆత్మహత్యలు జరుగుతున్నాయని, అయినా తెలంగాణను అడ్డుకోవాలని చూడడం సరి కాదని ఆయన అన్నారు.
వారేమిటో బయటపడ్డారు
రాష్ట్ర విభజనపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స వైఖరి బయటపడిందని బిజెపి నేత బండారు దత్తాత్రేయ అన్నారు. శనివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజీనామాలు చేస్తామని హైకమాండ్‌కు చెప్పి తెలంగాణపై నిర్ణయాన్ని ఆలస్యం చేశారని మండిపడ్డారు. పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణపై బిల్లు పెట్టే వరకు కాంగ్రెస్‌ను తెలంగాణ ప్రజలు నమ్మరని దత్తాత్రేయ అన్నారు.












Click it and Unblock the Notifications