శవమై తేలిన రవిశంకర్: వ్యభిచార ముఠా పట్టివేత

East Godavari
హైదరాబాద్: ఐదు రోజుల క్రితం అదృశ్యమైన రీజెన్సీ హోటల్స్ అధినేత రవిశంకర్ ప్రసాద్ శవమై తేలాడు. తూర్పు గోదావరి జిల్లా ఐ పోలవరం మండలం గోగులలంక రేవులో అతని మృతదేహం లభ్యమైంది. అతనిది హత్యా, ఆత్మహత్యా అనేది తేలాల్సి ఉంది. ఈ నెల 8వ తేదీన మార్నింగ్ వాక్‌కు వెళ్లిన రవిశంకర్ ప్రసాద్ యానాంలో అదృశ్యమయ్యాడు.

అతని మృతదేహం అనుమానాస్పద స్థితిలో అతని మృతదేహం లభ్యమైంది. సోమవారం అతని అదృశ్యంపై సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనను ఎవరైనా అపహరించి హత్య చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన సినీ నిర్మాత కూడా. అదృశ్యమైన సమయంలో అతని వద్ద ఫోన్ కూడా లేదని తెలుస్తోంది. వ్యాపార లావాదేవీల వ్యవహారంలో ఏమైనా ఇబ్బందులు ఏర్పడ్డాయా, కుటుంబంలో గొడవలున్నాయా అనేది తెలియడం లేదు.

ఇదిలావుంటే, విశాఖపట్నంలో హైటెక్ వ్యభిచార ముఠాను పోలీసులు పట్టుకున్నారు. బీచ్ రోడ్డులోని ఓ ఆపార్టుమెంటులో వ్యభిచారం జరుగుతుండగా పోలీసులు దాడి చేశారు. ఇద్దరు వ్యభిచారులను, ఇద్దరు విటులను పోలీసులు అరెస్టు చేశారు. వారిలో ఓ వైద్యుని భార్య కూడా ఉంది. వారి నమంచి పోలీసులు 7 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.

అనంతపురం జిల్లాలోని గుడిబండ మండలం ఎస్ఎస్‌గుండ్లలోని అక్కమ్మ ఆలయంలో చోరీ జరిగింది. గత రాత్రి ఆలయంలోకి చొరబడిన దుండగులు రూ.4 లక్షలు విలువ చేసే వెండి ఆభరణాలను అపహరించారు. ఆలయ అధికారులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+