మహాత్మా గాంధీ స్ఫూర్తి: అదరగొట్టిన మలాలా
ఇస్లామాబాద్: పాకిస్తాన్ బ్రేవ్ హార్ట్ మలాలా యూసుఫ్‌జాహీ ఈ నెల 12వ తేదీతో 16 ఏళ్ల పడిలో పడింది. ప్రపంచం ఆ రోజును మలాలా డేగా నిర్వహించుకుంది. పాకిస్తాన్‌లో బాలికల విద్య కోసం పోరాటం చేస్తున్న మలాలాపై తాలిబన్ ఉగ్రవాదాలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఐక్య రాజ్యసమితి వేదిక మీది నుంచి ఆమె స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేసింది.
ఐక్యరాజ్య సమితి యూత్ అసెంబ్లీ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది యువజన నాయకులు ఐక్య రాజ్యసమితిలో సమావేశమయ్యారు. తాను వేగంగా కోలుకోవడానికి ప్రార్థనలు చేసిన ప్రతి ఒక్కరికీ ఆమె దన్యవాదాలు తెలిపింది.

'మలాలా డే' నాకు మాత్రమే పరిమితమైన రోజు కాదు. ఇది హక్కుల కోసం గొంతెత్తే ప్రతి ఒక్కరిది. ప్రపంచ వ్యాప్తంగా తీవ్రవాదుల దుశ్చర్యల బాధితుల్లో నేనూ ఉన్నా. గొంతెత్తి మాట్లాడలేని వారి తరఫున నేను మాట్లాడుతున్నా. గత ఏడాది అక్టోబర్ 9న తాలిబన్లు నన్ను కాల్చారు. బుల్లెట్లు మా నోళ్లు మూస్తాయని వారు భావించారు. కానీ అధైర్యం నశించి, పోరాటం పుట్టుకొచ్చింది' అని వ్యాఖ్యానించింది.
మహాత్మా గాంధీ అహింసా సిద్దాంతం, మదర్ థెరిస్సా సేవాగుణం తనకు స్ఫూర్తినందించాయని చెప్పింది. మార్టిన లూథర్ కింగ్, నెల్సన్ మండేలా, మొహమ్మద్ అలీ జిన్నావంటి వారి నుంచి తాను ఆయుధాన్ని స్వీకరించినట్లు తెలిపింది. పుస్తకాలు, కలాలు తీసుకోవాలని, అవి అత్యంత శక్తివంతమైన ఆయుధాలని ఆమె అన్నది. ఒక చిన్నారి, ఓ టీచర్, ఓ పుస్తకం, ఓ కలం ప్రపంచాన్ని మార్చేస్తాయని అన్నారు. విద్యనే అన్నింటినీ పరిష్కారమని అభిప్రాయపడింది.
తన లక్ష్యాలను, ఆకాంక్షలను అడ్డుకుంటామని ఉగ్రవాదులు భావించారని, తన జీవితంలో ఏమీ మారలేదని, బలహీనత, భయం, నిరాశ తొలగిపోయాయని చెప్పింది. శక్తి, ధైర్యం, పరిమళం సమకూరాయని చెప్పింది.
<center><center><center><iframe width="640" height="360" src="https://www.youtube.com/embed/KtprX8i2k-Q?feature=player_detailpage" frameborder="0" allowfullscreen></iframe></center></center></center>












Click it and Unblock the Notifications