సమైక్యమే: జెసి, 'టిడిపికి జగన్‌పార్టీ వంత-కెసిఆర్ హీరో'

ఫిర్యాదు చేస్తా: మల్లాది విష్ణు
తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నేతలు సీమాంధ్ర నేతల పైన దిగజారి మాట్లాడుతున్నారని కృష్ణా జిల్లా సీనియర్ నేత మల్లాది విష్ణు అన్నారు. తెలంగాణ వారు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకోవడంలో తప్పులేదని కానీ, మరో ప్రాంతానికి నష్టం కలిగించేలా మాట్లాడటం ఏమాత్రం సరికాదన్నారు.
తమను విమర్శిస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన తమ పార్టీకి చెందిన కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డిల పైన ఏఐసిసికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. వారి మాటలు పార్టీకి ద్రోహం చేసేలా ఉన్నాయన్నారు.
కెసిఆర్ హీరో అయ్యారు
తెలంగాణకు అనుకూలంగా ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ లేఖ ఇవ్వడం వల్లనే రాష్ట్రానికి ఇన్ని ఇబ్బందులు వచ్చాయని మంత్రి శైలజానాథ్ అన్నారు. టిడిపి లేఖ ఇవ్వగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ దానికి వంత పాడిందన్నారు. టిడిపిని వీడిన కె చంద్రశేఖర రావు తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించి హీరో అయ్యారని ధ్వజమెత్తారు. సిడబ్ల్యూసిలో తెలంగాణ అంశంపై చర్చిస్తారని, సమైక్యంగానే ఉంటుందన్నారు.












Click it and Unblock the Notifications