జానాకు ఊరట: ఆస్తులపై పిటిషన్ కొట్టివేత, 10వేలు ఫైన్

కోర్టును తప్పుదారి పట్టించినందుకు పిటిషనర్‌కు రూ.10 వేల జరిమానాను విధించింది. జానా రెడ్డి హోంమంత్రిగా ఉన్నప్పుడు అక్రమాలకు పాల్పడ్డాడని, ఇతర రాష్ట్రాల్లో పవర్ ప్లాంట్స్ కలిగి ఉన్నారని, రూ.200 కోట్ల మేర అక్రమాస్తులు కూడగట్టారని పిటిషనర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఇందులో అక్రమాస్తులకు సంబంధించిన ఆధారాలు లేవని హైకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేసింది.
అవనిగడ్డ ఉప ఎన్నికపై నివేదిక కోరిన హైకోర్టు
కృష్ణా జిల్లా అవనిగడ్డ ఉప ఎన్నిక నిర్వహణ పైన నివేదిక ఇవ్వాలని ఎన్నికల కమిషన్‌ను హైకోర్టు ఆదేశించింది. ఉప ఎన్నిక నిర్వహణకు ఏం చర్యలు తీసుకున్నారో వారం రోజుల్లో చెప్పాలని కోర్టు ఆదేశించింది.
కోర్టుకు ధర్మాన, సబిత
వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కుంట్ను మాజీ మంత్రులు ధర్మాన ప్రసాద రావు, సబితా ఇంద్రా రెడ్డి సోమవారం ఉదయం నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరయ్యారు.
ఇదే కేసులో బిపి ఆచార్య, వెంకట్రామి రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, పునీత్ దాల్మియా కోర్టులో హాజరయ్యారు. ఎమ్మార్ కేసులో కోనేరు రాజేంద్ర ప్రసాద్, మధు, బిపి ఆచార్య, ఓఎంసీ కేసులో రాజగోపాల్ కోర్టుకు వచ్చారు. జగన్, గాలిలను వీడియో కాన్ఫరెన్సు ద్వారా విచారించనున్నారు.












Click it and Unblock the Notifications