కాంగ్రెసుది వంచన, నమ్మరు: కెసిఆర్, రాధాకృష్ణపై ఫైర్

KCR lashes out at Congress on Telangana
హైదరాబాద్‌: తెలంగాణపై కాంగ్రెస్‌ పార్టీని గుడ్డిగా విశ్వసించవద్దని, పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం బిల్లు పెట్టి దాన్ని ఆమోదించుకుంటేనే ఆ పార్టీని నమ్మాలని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ప్రజలకు పిలుపు నిచ్చారు. తెలంగాణపై ఢిల్లీలో పెట్టిన అఖిల పక్ష సమావేశంలో తీసుకున్న అన్నీ పార్టీల అభిప్రాయాలు తీసుకుని ఏం చేశారని, నెల రోజుల గడువు పెట్టింది ఎవరని అడుగుతూ కేంద్ర హోంమంత్రి షిండేనే కదా! మరి నెలంటే నెల అని కాదు.. వారం అంటే ఏడు రోజులు కాదు.. అని వెటకారాలు ఆడింది గులాం నబీ ఆజాద్‌ కాదా? అని ఆయన అన్నారు.

కాంగ్రెసు నాయకుల జాదూలు, ఇలాంటి ఆజాదూలను తెలంగాణ ప్రజలు ఇక విశ్వసించరు అని టీఆర్‌ఎస్‌ అధినేత కేసిఆర్‌ అన్నారు. తాను ప్రాణాల మీదకు తెచ్చుకుని ఆమరణ నిరాహార దీక్ష చేస్తే కేంద్రం డిసెంబర్‌ 9న తెలంగాణ ఇస్తున్నట్లు ప్రకటించిందని, పది రోజులు కూడా గడవకుండానే తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని నయ వంచన చేసిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదని ఆయన అన్నారు. ఇన్ని రకాల వంచనలకు పాల్పడ్డ కాంగ్రెస్‌ ఇప్పుడు కోర్‌ కమిటీ భేటీలోనే తెలంగాణను తేల్చేస్తారని అనుకుంటే అది పప్పులో కాలేసినట్లే అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు.

చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్ల కోసం నిర్ధేశించిన మహిళా బిల్లు విషయంలోనూ మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదేనన్నారు.ఆదిలాబాద్‌ జిల్లా ముధోల్‌ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు సముద్రాల వేణుగోపాలాచారి ఆదివారం తెలంగాణ భవన్లో కేసిఆర్‌ సమక్షంలో తెరాసలో చేరారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు 2001లో కరెంటు ఛార్జీల బిల్లులు పెంచిన రోజు నుండే ఆయన పతనం ప్రారంభమైందని కెసిఆర్. తెరాస ఉద్యమాన్ని చిన్నగా చేసి చూసిన చంద్రబాబు గానీ, సీమాంధ్ర మీడియా గానీ ఈ రోజున మహా ప్రభంజనమైన ఉద్యమాన్ని చూస్తోందన్నారు.

ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏం పీకలేడు

కెసిఆర్ ఏకాకి అంటూ ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎండి వేమూరి రాధాకృష్ణ తనపై వ్యక్తిగతంగా కథలు, కట్టు కథలు రాస్తున్నారని కేసిఆర్‌ మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంపై విషం చిమ్మే ఇలాంటి సీమాంధ్ర మీడియా, సీమాంధ్ర పత్రికలు తెలంగాణ ఉద్యమాన్ని ఏ మాత్రం తగ్గించలేవన్నారు.

వేమూరి రాధాకృష్ణా ఖబద్ధార్‌ .. తెలంగాణలో ఆంధ్రజ్యోతిని బహిష్కరించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి అంటూ కేసిఆర్‌ చిందులు తొక్కారు. తాను ఒంటరో, రాధాకృష్ణ ఒంటరో ఒక సారి తెలంగాణ జిల్లాలకు వస్తే తెలుస్తుందన్నారు. ఇలాంటి కథలు, కట్టు కథలు రాసి రాధాకృష్ణ తన ఒక్క వెంట్రుక కూడా పీకలేడని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+