తిరుమలలో అన్యమత ప్రచారం, బైబిల్‌తో దొరికిన జంట

దీంతో విజిలెన్స్ అధికారులు వారిని అదుపులోకి తీసుకొని విచారించారు. తమకు ఏ విషయం తెలియదని, అన్యమత ప్రచారం చేయడం లేదని ఆ దంపతులు విజిలెన్స్ అధికారులకు చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే బైబిల్, మతమార్పిడికి చెందిన పత్రాలు దొరకడంతో వారు బుకాయిస్తున్నారని అధికారులు అనుమానిస్తున్నారు.
ఉరేసుకొని విద్యార్థి ఆత్మహత్య
రంగారెడ్డి జిల్లా వికారాబాద్ పట్టణంలోని ఓ జూనియర్ కళాశాల హాస్టల్లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్న అనీల్ అనే విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అనిల్ కులకచర్ల మండలానికి చెందిన వాడు. జీవితంపై విరక్తితోనే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సంఘటన స్థలంలో లభించిన నోట్లో ఉంది.
నగదు స్వాధీనం
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పలు జిల్లాల్లో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఈ రోజు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం గొడవారిపాలెం చెక్ పోస్టు వద్ద కారులో తరలిస్తున్న రూ.12 లక్షలను, శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద ఆంధ్రా ఒడిశా సరిహద్దులో కటక్ నుండి విశాఖకు కారులో తరలిస్తున్న రూ.29 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మంత్రి గ్రామంలో అపహరణ
మంత్రి కాసు వెంకటకృష్ణా రెడ్డి స్వగ్రామం గుంటూరు జిల్లా నాదెండ్ల మండలో తూబాడు గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి పంచాయతీ కార్యాలయం తాళం పగులగొట్టి కీలక పత్రాలు దొంగిలించారు. నామినేషన్ త్రాలు దొంగిలించే ప్రయత్నాలు చేశారు.












Click it and Unblock the Notifications