ప్రేయసి గొడవ: భవనంపై నుంచి దూకి ఐటి ఉద్యోగి మృతి

IT employee jumps to death from office building
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలో ఓ ఐటి సంస్థలో పనిచేస్తు్న ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఆత్మహత్య చేసుకున్నాడు. చెన్నైలో ఈ నెలలో ఇటువంటి సంఘటన జరగడం ఇది నాలుగోసారి. రాజీవ్ గాంధీ సలాయ్‌ రోడ్డులో గల కాంతనంచవాడిలోలోని భవనం టెర్రాస్‌పై నుంచి దూకి ఆదివారంనాడు అతను ఆత్మహత్య చేసుకున్నాడు.

ప్రేయసి నిర్లక్ష్యం చేయడంతో అతను ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. వెల్లూరు జిల్లాకు చెందిన నవీన్ కుమార్ అనే 28 ఏళ్ల యువకుడు ప్రిన్స్ ఇన్ఫో సిటీ భవనంపై నుంచి దూకాడు. సహోద్యోగితో కలిసి నవీన్ కుమార్ భవనం 11వ అంతస్థుకు వెళ్లాడు. తాను ఓ కాల్ చేయాలని చెప్పి 11వ అంతస్థుకు వెళ్లాడు. టెర్రాస్‌పైన మొబైల్ ఫోన్ పెట్టేసి కిందికి దూకాడు

పెద్ద శబ్దం రావడంతో సెక్యూరిటీ గార్డు పార్కింగ్ స్థలానికి వెళ్లాడు. అక్కడ నవీన్ కుమార్ రక్తం మడుగులో పడి ఉండడాన్ని గమనించాడు. పోలీసులు నవీన్ కుమార్ కాల్ వివరాలను తనిఖీ చేశారు. ఆదివారంనాడు అతను తన ప్రేయసికి కనీసం నాలుగు సార్లు ఫోన్ చేసినట్లు తేలింది.

పెళ్లి విషయమై గొడవ వచ్చి నవీన్ కుమార్‌తో ప్రేయసి వారం రోజులుగా దూరంగా ఉంటోందని చెబుతున్నారు. ఆదివారంనాడు ఉదయం నుంచి నవీన్ కుమార్ విచారంగా ఉంటూ వచ్చాడని చెబుతున్నారు. షిఫ్ట్ ముగిసిన తర్వాత కూడా ఇంటికి వెళ్లలేదు. అతను కన్నగినగర్‌లో నివాసం ఉంటున్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+