బిడ్డను ఆపిల్ ఐఫోన్ చంపేసింది: చైనా ఫ్యామిలీ ఆరోపణ
బీజింగ్: అమెరికా బహుళ జాతి సంస్థ ఆపిల్ ఐఫోన్ చార్జింగ్‌లో ఉండగా మాట్లాడ్డానికి ప్రయత్నించిన సంఘటనలో మా అనే మహిళ చెందిన సంఘటన చైనాలోని జిన్‌జియాంగ్ పట్టణంలో సంభవించింది. ఈ విషయాన్ని మృతురాలి సోదరి ఐలున్ ట్విటర్‌తో పోలిన చైనా మైక్రో వెబ్‌సైట్ సినా వైబో ద్వారా వెల్లడించింది. దీనిపై ఆపిల్ సంస్థ సంజాయిషీని డిమాండ్ చేసింది.
ఆదివారం ఒక ప్రకటన ద్వారా ఈ సంఘటనపై ఆపిల్ విచారం వ్యక్తం చేసింది.. దీనిపై విచారణ జరుపుతామని మృతురాలి కుటుంబానికి హామీ ఇచ్చింది. 23 ఏళ్ల మా చైనా సదర్న్ ఎయిర్‌లైన్స్‌లో ఫ్లయిట్ అటెండెంట్‌గా పనిచేస్తుంది.

ఆపిల్ ఇన్‌కార్పోరేషన్ తమకు సమాధానం చెప్పాల్సి ఉంటుందని, చార్జింగ్‌లో ఉన్నప్పుడు ఎవరు కూడా మొబైల్ ఫోన్ మాట్లాడకూడదని ఐలున్ మెక్రో బ్లాగ్‌లో రాసింది. విద్యుత్ షాక్ తగిలి తన కూతురు మరణించిందని మా తండ్రి ధ్రువీకరించాడు.
మా దేహంపై కరెంట్ షాక్ తగిలిన గుర్తులున్నాయని అతను చెప్పాడు. దురదృష్టకరమైన సంఘటనకు తాము తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు ఆపిల్ ఓ ప్రకటనలో తెలిపింది. మృతురాలికి సంస్థ సంతాపం ప్రకటించింది. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపింది.












Click it and Unblock the Notifications