డబ్బులివ్వకుండా మోడి మీటింగ్‌కు రావొచ్చు: కిషన్‌రెడ్డి

ఆగస్టు 11న హైదరాబాదులో జరిగే మోడీ సభకు ఐదు రూపాయల సేకరణపై కొందరు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని కిషన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కార్యకర్తల నుండి సేకరించే పార్టీ కోసం ఉపయోగించమన్నారు. ఇటీవల ఉత్తరాఖండ్‌లో వరద బాధితుల సహాయ నిధికి ఇవ్వాలని నిర్ణయించామన్నారు.
కానీ దీని పైన కొందరు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారన్నారు. డబ్బులు ఇవ్వలేని వారు కూడా సమావేశానికి రావొచ్చునని చెప్పారు. సేవాభావంతో చేపట్టే కార్యక్రమం పైన విమర్శలు సరికాదన్నారు.
యువతను భాగస్వాములను చేసేందుకే: వెంకయ్య
సామాజిక బాధ్యతలో యువతను భాగస్వాములను చేసేందుకే ఐదు రూపాయలు రూపంలో విరాళాల సేకరణ చేపట్టినట్లు బిజెపి సీనియర్ నేత వెంకయ్య నాయుడు అన్నారు. మహాత్మా గాంధీ, జయప్రకాశ్ నారాయణ వంటి వారు కూడా ఉద్యమాలకు విరాళాలు సేకరించారన్నారు. మోడీ దుగుదలను చూసి ఓర్వలేకే కాంగ్రెసు దుష్ప్రచారం చేస్తోందన్నారు.












Click it and Unblock the Notifications