పిక్చర్స్: ఒడిషాలో మోడీ వేవ్, రాజకీయేతరమే...

పూరీ: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ మంగళవారం ఒడిషాలోని పూరీ జగన్నాథాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన బిజెపి కార్యకర్తలతో కూడా సమావేశమయ్యారు. మోడీ చార్టర్డ్ ఫ్లయిట్‌లో భువనేశ్వర్ వచ్చారు. ఆ తర్వాత పూరీకి వచ్చి శంకరాచార్యను కలుసుకున్నారు.

నరేంద్ర మోడీ ఒడిషా పర్యటన రాజకీయేతరమేనని బిజెపి నాయకులు చెప్పారు. ఆయన జగన్నాథుడి ఆశీస్సులు తీసుకున్నారని చెప్పారు. నరేంద్ర మోడీ జగన్నాథుడి భక్తుడు. అహ్మదాబాద్ కారు వేడుకల సందర్భంగా ెచేరా పహన్రా నిర్వహిస్తుంటారని చెప్పారు.

గుజరాత్ అభివృద్ధికి ఒడిషా ప్రజలు అందిస్తున్న సేవలకు మోడీ కృతజ్ఝతలు తెలిపారు. గుజరాత్ అభివృద్ధికి ఒరియా సోదరులు అందించిన సేవలు గణనీయమైనవని ఆయన అన్నారు. కాగితంపై రాసుకుని ఆయన ప్రసంగంలో కాస్తా ఒరియా కూడా మాట్లాడారు.

పూరీలో మోడీ..

గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పూరీలోని జగన్నాథాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులకు అభివాదం చేస్తూ ఇలా...

భువనేశ్వర్ విమానాశ్రయంలో మోడీ

పూరీకి బయలుదేరడానికి ముందు నరేంద్ర మోడీ మంగళవారంనాడు భువనేశ్వర్ విమానాశ్రయానికి చేరుకున్నారు.

భువనేశ్వర్‌లో అభివాదం చేస్తూ

భువనేశ్వర్ విమానాశ్రయం చేరుకున్న మోడీ అభివాదం చేస్తూ ఇలా...

మోడీ మాస్కుల్లో బిజెపి కార్యకర్తలు

మోడీ రాక సందర్భంగా ఉత్సాహంతో నిండిన బిజెపి కార్యకర్తలు మోడీ మాస్క్‌లు ధరించి ఇలా కనిపించారు.

జగన్నాథాలయంలో మోడీ

పూరీ జగన్నాథాలయాన్ని నరేంద్ర మోడీ మంగళవారం సందర్శించారు.

ఒడిషాలో మోడీ వేవ్

జగన్నాథాలయం సందర్శించిన మోడీ పూరీ శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతితో ఇలా..

జగన్నాథుడి దర్శనానికి ఇలా...

నరేంద్ర మోడీ పూరీ జగన్నాథాలయానికి వచ్చినప్పుడు ఇలా అభివాదం చేస్తూ కనిపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+