కేంద్రమంత్రిపై కాల్పులు, కోర్టు ప్రాంగణంలో వరుస బ్లాస్ట్స్

దుండగులు మంత్రి కారు పైన బాంబు కూడా విసిరారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రచారం కోసం వచ్చిన కేంద్ర మంత్రి పైన ఈ కాల్పులు జరిగినట్లుగా తెలుస్తోంది.
కోర్టు ప్రాంగణంలో వరుస బాంబు పేలుళ్లు
బీహార్‌లోని వైశాలి జిల్లా హాజీపూర్ కోర్టు ప్రాంగణంలో మంగళవారం వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లతో కోర్టు ప్రాంగణంలోని ప్రజలు భయాందోళనకు లోనయ్యారు. పేలకుండా ఉన్న ఒక బాంబును పోలీసులు నిర్వీర్యం చేశారు.
బుద్దగయ పేలుళ్ల కేసులో అనుమానితుడి చిత్రం విడుదల
జాతీయ దర్యాఫ్తు సంస్థ(ఎన్ఐఏ) బీహార్‌లోని బుద్దగయ పేలుళ్లకు సంబంధించిన కేసులో అనుమానితుల ఊహాచిత్రాలను విడుదల చేసింది. ప్రత్యక్ష సాక్షులు కథనం ఆధారంగా ఒక వ్యక్తి చిత్రం విడుదల చేశామని, దీన్ని ఆధారంగా చేసుకొని సిసిటివి ఫుటేజిని పరిశీలిస్తామని అధికారులు తెలిపారు. ఇప్పటికీ సిసిటివి ఫుటేజీ స్పష్టంగా లేదని, బౌద్ధ సన్యాసులు ధరించే దుస్తుల్లో ఉన్న అనుమానితుడు ఇక్కడి వ్యక్తో కాదో తెలియడం లేదన్నారు.












Click it and Unblock the Notifications