వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయమ్మ ఫీజు దీక్ష, చంద్రబాబును క్రాస్ చేసిన షర్మిల

By Srinivas
|
Google Oneindia TeluguNews

YS Vijayamma and Sharmila
హైదరాబాద్: ఈ నెల 18, 19 తేదీల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షులు, పులివెందుల శాసన సభ్యురాలు వైయస్ విజయమ్మ ఫీజు పోరు దీక్షను చేపట్టనున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఇందిరాపార్కు వద్ద విజయమ్మ దీక్ష చేస్తారని ఆ పార్టీ నేతలు బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి బుధవారం తెలిపారు. వారు ఫీజు పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ దీక్షకు భారీగా విద్యార్థులు తరలి రావాలని విజ్ఞప్తి చేశారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి విద్యార్థుల కోసం ఫీజు రీయింబర్స్‌మెంట్స్ ప్రవేశ పెడితే, కిరణ్ కుమార్ రెడ్డి సర్కారు దానిని తుంగలో తొక్కిందని భూమన ఆరోపించారు.

షర్మిల యాత్ర రికార్డ్

తమ పార్టీ నేత షర్మిల చేపట్టిన మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర మరో మైలు రాయికి చేరుకుందని భూమన అన్నారు. షర్మిల 2,800 కిలోమీటర్ల యాత్రను పూర్తి చేశారన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అవార్డుల కోసమే, రివార్డుల కోసమే యాత్ర చేస్తే షర్మిల మాత్రం ప్రజల మనసులను గెలుచుకునేందుకు చేశారన్నారు.

ఆగస్టు మొదటి వారంలో షర్మిల యాత్ర మూడువేల కిలోమీటర్లు దాటుతుందన్నారు. ఈ పాదయాత్ర ప్రపంచ రాజకీయ చరిత్రలో సువర్ణ అధ్యాయంగా నిలిచిపోనుందన్నారు. రెండున్నర కోట్ల మంది హృదయాలను తాకుదూ పాదయాత్ర లక్ష్యం దిశగా దూసుకుపోతోందన్నారు. కాగా గతంలో చంద్రబాబు వస్తున్నా మీకోసం పేరుతో 2,800 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఇప్పుడు షర్మిల దానిని దాటారు.

English summary
YSR Congress Party honorary president YS Vijayamma would undertake two day fast on July 18 and 19 demanding the reversal of the GO capping fees reimbursement for higher and technical education.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X