
సిటీలో డ్యాన్స్!: స్వీట్స్ పంచుకున్న బార్ గర్ల్స్(పిక్చర్స్)
న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజధాని ముంబై బార్లలో నృత్యాలకు సుప్రీం కోర్టు పచ్చ జెండా ఊఫిన విషయం తెలిసిందే. మంగళవారం భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఈ మేరకు తీర్పు ఇచ్చింది. ఎనిమిదేళ్ల తర్వాత ముంబైలోని బార్లలో బార్ డాన్సుకు అనుకూలంగా తీర్పు వచ్చింది.
2005 బొంబాయి పోలీసు (సవరణ) చట్టం కింద మహారాష్ట్ర బార్లలో ప్రభుత్వం నృత్యాలను నిషేధించింది. దీన్ని బార్ యజమానులు, డ్యాన్సర్ల సంఘం సవాల్ చేసింది. ఈ సంఘానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తన నిర్ణయాన్ని వెలువరించింది. చట్టం అమలు రాజ్యాంగం ఆర్టిల్ 19 మేరకు వ్యక్తి వృత్తి చేసుకుని హక్కుకు భంగకరంగా మారిందని సుప్రీం అభిప్రాయపడింది.
సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ రాజధాని హైదరాబాదులో కూడా డ్యాన్స్ బార్లు తెరుచుకునే అవకాశాలు లేకపోలేదంటున్నారు. ఆర్కెస్ట్రా ఆర్టిస్టులు పలువురు హైదరాబాదులోని బార్లలో డ్యాన్సుల రద్దుపై ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారట. సుప్రీం తీర్పును హైకోర్టు దృష్టికి కూడా తీసుకు వెళ్లనున్నారట.

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు మంగళవారం బార్ డ్యాన్సులకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ముంబైలోని బార్ గర్ల్స్ మిఠాయిలు తినిపించుకుంటున్న దృశ్యం

2005లో మహారాష్ట్ర ప్రభుత్వం బార్ డ్యాన్స్‌ను నిషేధించింది. తాజాగా మంగళవారం సుప్రీం తమకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో ఆనందంతో స్వీట్స్ పంచుకుంటున్నారు.

సుప్రీం తీర్పు నేపథ్యంలో హైదరాబాదులోని ఆర్కెస్ట్రా ఆర్టిస్టులు పలువురు ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు దృష్టికి తీసుకు వెళ్లనున్నారట.