
విషాదం: 20 మంది ప్రాణాలు తీసిన మధ్యాహ్న భోజనం

అస్వస్థతకు గురైన చాప్రాలోని ప్రభుత్వ అస్పత్రికి తరలించగా, అప్పటికే 20 మంది చనిపోయినట్లు డాక్టర్లు ప్రకటించారని వారు చెప్పారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం అధికారి ఒకరు చెప్పారు. ఫోరెన్సింగ్ ల్యాబ్ బృందం దర్యాప్తుకు సహకరిస్తుందని, శరన్ డివిజనల్ కమిషనర్, డిఐజి సంయుక్తంగా ఈ దర్యాప్తు నిర్వహిస్తారని వారు చెప్పారు.
అంతేకాకుండా మృతి చెందిన పిల్లల కుటుంబాలకు 2 లక్షల చొప్పున పరిహారాన్ని కూడా ఆయన ప్రకటించారు. ఆర్‌జెడి అధ్యక్షుడు లాలూప్రసాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో చాప్రా ఉంది. బీహార్‌లో మధ్యాహ్న భోజనం తిని పిల్లలు చనిపోయిన నేపథ్యంలో అక్కడి పరిస్థితిని స్వయంగా అంచనా వేయడానికి కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ మంగళవారం ఒక ఉన్నతాధికారిని రాష్ట్రానికి హుటాహుటిన పంపించింది.
దేశంలో మధ్యాహ్న భోజనం పథకాన్ని పర్యవేక్షిస్తున్న మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శి అమర్‌జిత్ సింగ్‌ను పరిస్థితిని తెలుసుకోవడానికి సంఘటనా స్థలానికి పంపించినట్లు న్యూఢిల్లీలో మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.