హైద్రాబాద్ రెండో రాజధాని, విభజన ఆపలేం!: ఉండవల్లి

Undavalli Arun Kumar
విశాఖపట్నం: హైదరాబాదును దేశ రాజధానిగా చేయాలని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ ఎప్పుడో చెప్పారని రాజమండ్రి కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గురువారం అన్నారు. ఆయన విశాఖలో విలేకరులతో మాట్లాడారు. హైదరాబాదు పైన ఉన్న ప్రేమతో సీమాంధ్రులు విశాఖను విస్మరించారన్నారు. విభజన అనివార్యమైతే హైదరాబాదును దేశానికి రెండో రాజధానిగా చేయాలని డిమాండ్ చేశారు.

గతంలో ఏర్పడిన మూడు రాష్ట్రాలు అంబేడ్కర్ అభిప్రాయం ప్రకారమే ఏర్పడ్డాయన్నారు. దేశ ప్రజలు ఒప్పుకుంటేనే రాష్ట్ర విభజన ఆపలేమన్నారు. విడిపోయే వారికి అసెంబ్లీలో మెజార్టీ తప్పనిసరి అని చెప్పారు. దేశానికి మంచి అయ్యే ఏ అభిప్రాయమైన తెలంగాణ, సీమాంధ్ర నేతలు అంగీకరించాలన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి యూపిఏ కృషి చేస్తోందన్నారు. రాష్ట్రం విడిపోయినా వచ్చే ప్రమాదమేమీ లేదన్నారు. అయితే దేశ ప్రజలు ఒప్పుకోవాలని, అసెంబ్లీలో తీర్మానం కావాలన్నారు.

దూషించడమే పనిగా పెట్టుకున్నారు

తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు సీమాంధ్ర వారిని దూషించడమే పనిగా పెట్టుకున్నారని ఉండవల్లి అన్నారు. తెలంగాణ ప్రజలకు అవాస్తవాలు చెప్పి, సీమాంధ్రులపై ద్వేషం పెంచుతున్నారన్నారు. సీమాంధ్రులను దోపిడీ దొంగలుగా తెరాస ముద్ర వేసిందన్నారు. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడం ద్వారా ఇరు ప్రాంతాల ప్రజల మధ్య విద్వేషాలు రగిలిస్తోందని ఉండవల్లి మండిపడ్డారు.

బిజెపి ఇచ్చిన మాటపై నిలబడలేదన్నారు. కాకినాడ ఒక వోటు రెండు రాష్ట్రాల తీర్మానం ఏమైందన్నారు. అవినీతిని అరికట్టేందుకు యూపిఏ ఎనలేని కృషి చేస్తోందన్నారు. ప్రభుత్వం జవాబుదారీతనంతో వ్యవహరిస్తోందన్నారు. తొమ్మిదేళ్ల యూపిఏ పాలన ఎన్నో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుందన్నారు. ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల మధ్య విభేదాలు వస్తాయని అంబేడ్కర్ చెప్పారన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+