సోమరిపోతు వ్యాఖ్య: కేంద్రమంత్రి కావూరిపై ఫిర్యాదు

ఉపాధి హామీ పథకంలో ఎస్సీ, ఎస్టీ, బిసి వర్గాలకు చెందిన కూలీలే పని చేస్తున్నారని, వారి మనోభావాలు దెబ్బతినేలా కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారని, ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరారు. కేసు నమోదు చేయని పక్షంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు. కాగా ఇటీవల కావూరి.. పథకాల ద్వారా ప్రజలు సోమరిపోతులవుతున్నారని వ్యాఖ్యానించారు.
శంకర రావుకు ఊరట
మాజీ మంత్రి, కంటోన్మెంట్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర రావుకు బుధవారం హైకోర్టులో కాస్త ఊరట లభించింది. డిజిపి దినేష్ రెడ్డి, ముఖ్యమంత్రి పైన, ఇతరులపైనా ఎటువంటి ఆధారాలు లేకుండా అభియోగాలు మోపుతూ మీడియాకు స్టేట్‌మెంట్లు ఇవ్వడంపై దాఖలైన పరువు నష్టం కేసు విచారణతో పాటు అన్ని ప్రొసీడింగ్స్‌ను వారం రోజులు పాటు నిలిపివేస్తూ హైకోర్టు మద్యంతర స్టే ఆదేశాలు జారీచేసింది.
డిజిపి తదితరులపై ఎటువంటి ఆధారాలు లేకుండా అభియోగాలు మోపడంపై గత నెలలో సైఫాబాద్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయింది. ఈ ఫిర్యాదుపై సైఫాబాద్ పోలీసులు ఐపిసిలోని సెక్షన్ 500, 506 కింద కేసు నమోదు చేశారు. ఈ కేసు విచారణతో సహా అన్ని ప్రొసీడింగ్స్‌ను రద్దు చేయాలని కోరుతూ శంకర రావు బుధవారం లంచ్ మోషన్‌లో హైకోర్టును ఆశ్రయించారు. దీనిని విచారించిన కోర్టు వారం రోజులపాటు అన్ని ప్రొసీడింగ్స్ నిలిపి వేస్తూ మధ్యంతర స్టే ఆదేశాలు జారీచేశారు.












Click it and Unblock the Notifications