వైఎస్‌పై అభిమానంతో..: జగన్‌ను ఏకిపారేసిన ఉండవల్లి

Ys Jagn and Undavalli Arun Kumar
విశాఖపట్నం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ గురువారం నిప్పులు చెరిగారు. ఆయన విశాఖలో విలేకరులతో మాట్లాడారు.

దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పైన ఉన్న అభిమానంతో తాము జగన్‌ను ఏమీ అనలేకపోతున్నామంటూనే మండిపడ్డారు. వైయస్ కారణంగా జగన్ పైన ధాటిగా మాట్లాడలేకపోతున్నామన్నారు. ఒకప్పుడు వైయస్‌ను సమర్థించిన వాళ్ల ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి దుర్మార్గుల్లా కనిపిస్తున్నారని విమర్శించారు.

జగన్ పార్టీలో చేరిన దాడి వీరభద్ర రావు, మైసూరా రెడ్డిలు తమ పైన విమర్శలు చేయడం విడ్డూరమన్నారు. వైయస్ ఉన్నప్పుడు ఆయన పాలన పైన ఆరోపణలు గుప్పించిన వారు తమ పైన మాట్లాడటమా అని ప్రశ్నించారు. తాను తప్పు చేయలేదని జగన్ ఎప్పుడైనా చెప్పారా అని ప్రశ్నించారు.

ఆయన తన ఆస్తుల కేసులో సిబిఐ విచారణకు ఏమాత్రం సహకరించడం లేదన్నారు. వైయస్ పైన వచ్చిన ప్రతి ఆరోపణను ఖండించిన వ్యక్తిని తానే అన్నారు. షర్మిల చెప్పినట్లుగా ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి ఓటేస్తే జగన్ నిర్దోషి అవుతాడా అని ప్రశ్నించారు. ఆయన చేసిన తప్పులు ఒప్పులవుతాయా అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+