విద్యార్థులకు సుప్రీంలో ఊరట: నీట్ నోటిఫికేషన్ కొట్టివేత

గతంలో ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం అడ్మిషన్లు కొనసాగించాలని సూచించింది. పాత పద్ధతిలోనే కౌన్సెలింగ్ నిర్వహించాలని, నీట్‌ను రద్దు చేయాలని ఆదేశించింది. ఇది రాష్ట్ర విద్యార్థులకు ఊరట కలిగించే అంశం.
అన్ని రాష్ట్రాలు తమ తమ వైద్య పరీక్షలను యథాతథంగా నిర్వహించుకోవచ్చునని సుప్రీం చెప్పింది. నీట్‌ను రద్దు చేయాలని చెప్పింది. మెడికల్ కౌన్సెల్ ఆఫ్ ఇండియాకు నీట్ పరీక్షను నిర్వహించే అధికారం లేదని తేల్చి చెప్పింది. నీట్ పరీక్షను పలు రాష్ట్రాలు వ్యతిరేకించాయి.
మహారాష్ట్రలో నలుగురు రాష్ట్రవాసులు మృతి
మహారాష్ట్రలో నాగర్‌సోల్ వద్ద గురువారం జరిగిన ఘోర ప్రమాదంలో నలుగురు రాష్ట్రవాసులు మృతి చెందారు. నాగర్ సోల్ నుంచి షిర్డీ వెళ్తున్న కారుపై చెట్టు విరిగిపడింది. ఈ ప్రమాదంలో గుంటూరు జిల్లా నర్సారావుపేటకు చెందిన నలుగురు మృతి చెందారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు.












Click it and Unblock the Notifications