తెలంగాణ: బెంగళూర్‌లో ఆజాద్‌తో కిరణ్ రహస్య భేటీ

Kiran kumar Reddy and Ghulam Nabi Azad
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూర్‌లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర మంత్రి గులాం నబీ ఆజాద్‌తో రహస్యంగా భేటీ అయినట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనడానికి కిరణ్ కుమార్ రెడ్డి బెంగళూర్ వచ్చారు. ఈ సందర్బంగా ఆయన ఓ హోటల్లో ఆజాద్‌ను కలుసుకున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణ అంశంపైనే కిరణ్ కుమార్ రెడ్డి ఆజాద్‌తో రహస్య మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యవాదాన్ని బలపరుస్తున్నట్లు తెలుస్తోంది. ఆజాద్, కిరణ్ మధ్య అర గంటపాటు చర్చలు జరిగినట్లు సమాచారం. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కిరణ్ కుమార్ రెడ్డి కలవాల్సి ఉండింది. అయితే ఆజాద్‌తో భేటీ అనంతరం ఆయన తిరిగి వెళ్లిపోయారు.

సోనియాతో పొన్నాల భేటీ..

ఢిల్లీలో రాష్ట్రమంత్రి పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిశారు. బుధవారం సోనియా నివాసానికి వెళ్లిన పొన్నాల దాదాపు 20 నిమిషాలు ఆమెతో సమావేశమయ్యారు. తెలంగాణ అంశంపై మరికొద్ది రోజుల్లో సిడబ్ల్యుసి సమావేశం నిర్వహిస్తారంటూ వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో ప్రత్యేకరాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలని పొన్నాల కోరినట్లు తెలుస్తోంది. గతంలో సాగునీటి శాఖ మంత్రిగా పనిచేసిన పొన్నాల రాష్ట్రంలో నీటి పంపకాలకు సంబంధించి ఒక నివేదికను సోనియాకు అందించినట్లు సమాచారం.

దిగ్విజయ్‌తో నాదెండ్ల

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్‌ను మంత్రి అహ్మదుల్లా, స్పీకర్ నాదెండ్ల మనోహర్‌లు కలిశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ వీరు దిగ్విజయ్‌ను కోరినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. తెలంగాణపై శాసనసభలో పెట్టాల్సిన తీర్మానంపై దిగ్విజయ్ సింగ్ నాదెండ్ల మనోహర్‌తో మాట్లాడినట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+