వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణపై సంప్రదింపులు పూర్తయ్యాయి: దిగ్విజయ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana and Digvijay Singh
ముంబై/హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలంగాణపై సంప్రదింపులు పూర్తయ్యాయని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకులు దిగ్విజయ్ సింగ్ శుక్రవారం అన్నారు. దిగ్విజయ్ మహారాష్ట్రలో పర్యటిస్తున్నారు. ముంబై, పుణేలలో విలేకరులతో మాట్లాడారు. లౌకికవాదం, భారతీయ జనతా పార్టీ పైన సుదీర్ఘంగా మాట్లాడారు.

అదే సమయంలో తెలంగాణ అంశంపై స్పందించారు. తెలంగాణపై సంప్రదింపులు పూర్తయ్యాయని, యూపిఏ ప్రభుత్వం త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. తెలంగాణపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే గురువారం చెప్పిన విషయం తెలిసిందే. తెలంగాణపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని అయితే, అది పార్లమెంటు సమావేశాలకు ముందా లేక తర్వాతనా అన్న విషయం మాత్రం తెలియదన్నారు.

సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నట్లు చెప్పారు. త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పిన షిండే.. ఆ నిర్ణయం కాంగ్రెసు పార్టీదా, యూపిఏ నిర్ణయమా లేక ప్రభుత్వానిదా అని కూడా వెల్లడించలేదు. అయితే ఈ రోజు దిగ్విజయ్ మాత్రం యూపిఏ ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.

హాట్ హాట్‌గా కేబినెట్ సమావేశం?

కాగా ఈ రోజు ఎపి కేబినెట్ సమావేశమైంది. ఈ సమావేశానికి పలువురు మంత్రులు హాజరయ్యారు. ఇటీవల కోర్ కమిటీ భేటీకి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్రకు అనుకూలంగా రోడ్ మ్యాప్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రులు సిఎంను ప్రశ్నించే అవకాశాలు లేకపోలేదు. దీంతో కేబినెట్ సమావేశం హాట్ హాట్‌గా మారే అవకాశముందా? అనే చర్చ సాగుతోంది. పంచాయతీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు.

English summary
AP Congress Party incharge Digvijay Singh on Friday said that no more consultations over Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X