ధర్మాన, సబితలపై సిబిఐ కస్టడీ పిటిషన్ 25కి వాయిదా

Sabitha and Dharmana custody petition postponed
హైదరాబాద్: మాజీ మంత్రులు ధర్మాన ప్రసాద రావు, సబితా ఇంద్రా రెడ్డిల జ్యూడిషియల్ కస్టడీ పిటిషన్ పైన విచారణను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) ప్రత్యేక న్యాయస్థానం ఈ నెల 25వ తేదికి వాయిదా వేసింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో ఓ ఛార్జీషీటులో సబిత, ధర్మానలు అభియోగాలు ఎదుర్కొంటున్నారు.

దీంతో వారు రాజీనామా చేశారు. ఆ తర్వాత వారిని తమ జ్యూడిషియల్ కస్టడీకి అప్పగించాలని ప్రత్యేక కోర్టులో సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది. ఇటీవలే మాజీ మంత్రులు కౌంటర్ దాఖలు చేశారు. శుక్రవారం దీనిపై విచారణ ప్రారంభించిన కోర్టు తదుపరి విచారణనను 25వ తేదికి వాయిదా వేసింది.

మోపిదేవికి అస్వస్థత

మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ మరోసారి అస్వస్థతకు గురయ్యారు. జగన్ ఆస్తుల కేసులో వాన్‌పిక్ అంశంలో మోపిదేవి అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఆయన ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

శుక్రవారం ఉదయం ఆయన స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో చికిత్స కోసం జైలు అధికారులు నిమ్స్‌కు తరలించారు. గత కొంతకాలంగా మోపిదేవి వెన్నునొప్పితో, అధిక రక్తపోటుతో బాధపడుతున్నారు. గతంలో కూడా మోపిదేవికి హైబిపి ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+