వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్ పార్టీ మెలిక: తెలంగాణపై డైలమా పుకార్లు

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం కొత్త ఆలోచన చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు పిటిఐ వార్తా సంస్థ ఓ కథనాన్ని ఇచ్చింది. వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ మెలికతోనే కాంగ్రెసు అధిష్టానం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. దీంతో తెలంగాణపై మరోసారి ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పార్టీలతో అఖిల పక్ష సమావేశం నిర్వహించాలని ఆలోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

శుక్రవారంనాడు ప్రధాని మన్మోహన్ సింగ్ నివాసంలో జరిగిన కోర్ గ్రూప్ సమావేశంలో ఈ విషయంపై చర్చ జరిగినట్లు చెబుతున్నారు. అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లు పిటిఐ వార్తాకథనం తెలిపింది. రాష్ట్ర విభజన అనివార్యమని సంకేతాలు అందిన నేపథ్యంలో తెలంగాణపై రెండో ఎస్సార్సీ వేసే ఆలోచన ముందుకు వచ్చినట్లు పిటిఐ వార్తాకథనం తెలియజేస్తోంది. అయితే, తెలంగాణపై రెండో ఎస్సార్సీ వేయాలా, అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలా అనే విషయంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తెలంగాణపై యుపిఎ భాగస్వామ్య పక్షాలతో సమావేశం నిర్వహించాలని కోర్ గ్రూప్ నిర్ణయించినట్లు చెబుతున్నారు.

Sonia Gandhi and YS Jagan

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కేంద్రం తీసుకోబోయే నిర్ణయం పైన కొత్త మెలిక పెట్టిన విషయం తెలిసిందే. జగన్ పార్టీ కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేకు ఇటీవల తెలంగాణపై లేఖ రాసింది. కోర్ కమిటీ తెలంగాణపై తేల్చేస్తుందని అందరూ చూశారని కానీ, నిర్ణయం దిగ్భ్రాంతి కలిగించిందని లేఖలో విమర్శించింది. ఇటు కాంగ్రెసు, అటు కేంద్రం తెలంగాణపై వైఖరి చెప్పలేదని, చెప్పకుండానే అభిప్రాయం ప్రకటించడం సరికాదన్నారు.

ముందుగా కాంగ్రెసు, కేంద్రం వైఖరి స్పష్టం చేసి, ఆ తర్వాత అందరి అభిప్రాయాలను తీసుకోవాలని సూచించింది. మిగిలిన పార్టీ నేతలతో విస్తృత చర్చ జరపాలని కోరారు. ఈ ప్రక్రియ లేకుండా ఏకపక్ష నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ఏ ప్రాంతానికి అన్యాయం జరగవద్దని వారు అందులో విజ్ఞప్తి చేశారు.

అయితే, తెలంగాణపై సంప్రదింపులు పూర్తయ్యాయని కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ దిగ్విజయ్ సింగ్ శుక్రవారం మరోసారి చెప్పారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవడానికి ఈ నెల 28వ తేదీ కాంగ్రెసు వర్కింగ్ కమిటీ (సిడబ్ల్యుసి) సమావేశం జరిగే అవకాశాలున్నాయి. ఈ సమావేశంలో తెలంగాణపై పార్టీపరంగా సిడబ్ల్యుసి తన నిర్ణయాన్ని తీసుకుంటుందని అనుకుంటున్నారు. కాంగ్రెసు కచ్చితమైన నిర్ణయం తీసుకున్న తర్వాత అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయవచ్చునని ఊహాగానాలు చెలరేగాయి. అ

వచ్చే నెల 5వ తేదీన పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఈలోగానే తెలంగాణపై నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో కాంగ్రెసు అధిష్టానం ఉంది. ఈలోగా రెండు, మూడు అంతర్గత సమావేశాలు జరుగుతాయని అంటున్నారు. తెలంగాణపై అఖిల పక్ష సమావేశం ఉండదని కోర్ గ్రూప్ సమావేశానంతరం కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ చెప్పారు.

English summary
According to PTI report - Congress high command is in dilemma to take decission on Telangana. It is said that YS Jagan's YSR Congress letter on Telangan issue is the reason for that.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X