వివాహం సమస్య: స్మశానంలో శవమై తేలిన టెక్కీ

వంశీకృష్ణ హైదరాబాదులోని నానక్‌రాంగుడాలో ఉంటున్నాడు. వివాహ సంబంధమైన సమస్యలతో అతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు. అతను మంజరి అనే అమ్మాయిని నిరుడు మేలో పెళ్లి చేసుకున్నాడు.
వంశీ మంగళవారం సాయంత్రం నాలుగున్నర గంటలకు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అతను కనిపించడం లేదని కుటుంబ సభ్యులు బుధవారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. ఆ సాయంత్రమే అతని శవం కనిపించింది.
ఇదిలావుండగా, మాచరేవులలో ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన ఇద్దరు బిటెక్ విద్యార్థులు గురువారం ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. కెజి రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన మోనిక, రఫీక్ అనే ఇద్దరు ప్రేమికులు పెద్దల వ్యతిరేకతతో ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications