యుపిలో మాజీ బిఎస్పీ ఎమ్మెల్యే కాల్చివేత

ఉత్తర ప్రదేశ్‌లోని అజమ్‌గర్ జిల్లా సగ్రీ ప్రాంతంలో ఆయన ఉండగా ముగ్గరు వ్యక్తులు ఆయనపై కాల్పులు జరిపారు. అతను ఇంటి బయట ఉన్న సమయంలో కాల్పులు జరిపారు.
సర్వేష్ కుమార్ సింగ్ చనిపోవడంతో ఆయన మద్దతుదారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. పలు వాహనాలను దగ్ధం చేశారు.
కుటుంబ కలహాల కారణంగానే సర్వేష్ హత్య గావింపబడ్డాడనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఆయన మద్దతుదారులు మాత్రం దానిని కొట్టి పారేస్తున్నారు.
కాగా కొద్దికాలం క్రితం బిఎస్పీని వీడిన సర్వేష్... వచ్చే ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ లేదా బిజెపి నుండి ఏదైనా లోకసభ స్థానం నుండి పోటీ చేయాలని భావించారు.












Click it and Unblock the Notifications