'పంచాయతీ': భార్యా కొడుకు మృతి, ఆస్పత్రిలో అతను

అనంతపురం జిల్లా గోరంట్ల మండలం గంగపల్లికి చెందిన లోకబాంధవరెడ్డి స్థానిక ఎన్నికలపై భార్య అరుణమ్మతో గొడవ పడ్డాడు. అది ముదిరి ఘర్షణకు దారి తీసింది. మద్యం మత్తులో ఉన్న లోకబాంధవ రెడ్డి భార్యపై కత్తితో దాడి చేశాడు.
నాలుగో తరగతి చదువుతున్న కుమారుడు నాగార్జున రెడ్డి అడ్డుకోవడానికి ప్రయత్నించాడు. ఈ సమయంలో కోపోద్రిక్తుడైన లోకబాంధవరెడ్డి ఉచితానుచితాలు మరిచచి కొడుకపై దాడి చేశాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన నాగార్జున రెడ్డి అక్కడికక్కడే మరణించాడు.
కుమారుడి మరణంతో మనస్తాపానికి గురైన భార్యాభర్తలు శరీరాలపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నారు. ఈ సంఘటనలో అరుణమ్మ మరణించగా, లోకబాంధవరెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని చికిత్స నిమిత్తం హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.












Click it and Unblock the Notifications