వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నరేంద్ర మోడీపై అన్నా యూటర్న్: శివసేన వ్యతిరేకత

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రి, బిజెపి ప్రచార రథసారథి నరేంద్ర మోడీపై సామాజిక కార్యకర్త అన్నా హజారే మాట మార్చారు. నరేంద్ర మోడీ మతతత్వవాది కాదని ఇంతకు ముందు కితాబు ఇచ్చిన ఆయన తాజాగా మోడీ లౌకికవాది కాదని అన్నారు. తాను మోడీని పొడిగినట్టు వచ్చిన వార్తలను ఆయన ఖండించారు. మోడీ మతతత్వ వాది కాదని గానీ, అవునని గానీ నేనెప్పుడూ చెప్పలేదని, దేన్ని తేల్చడానికైనా తగిన ఆధారాలు లేవని మాత్రమే అన్నానని హజారే తెలిపారు.

ఇదిలావుంటే, నరేంద్ర మోడీనే తమ ప్రధాని అభ్యర్థిత్వం పట్ల శివసేన తీవ్ర వ్యతిరేకత ప్రదర్శిస్తున్నట్లు అర్థమవుతోంది. మోడీనే ప్రధాని అభ్యర్థి అని బిజెపి పరోక్షంగా సంకేతాలివ్వడం ఎన్డీయేలో లుకలుకలకు కారణమవుతున్న సంగతి తెలిసిందే. ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని అంగీకరించబోమని శివసేన అధినేత ఉద్దవ్ థాకరే పరోక్షంగా వెల్లడించారు. 'ప్రస్తుతం దేశానికి నాయకత్వం వహించేందుకు ఒక సమర్థవంతమైన వ్యక్తి కావాలి. ఇప్పటి వరకూ మాకైతే ఆలంటి వ్యక్తి ఎవరూ కనిపించలేదు. ముందు ఒక పటిష్టమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు కానివ్వండి' అని ఉద్దవ్ స్పందించారు.

Anna takes a u-turn within 24 hours, calls Modi communal

అసోచామ్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఉద్దవ్ ఆ తర్వాత మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. మోడీని ప్రధాని అభ్యర్థిగా తెస్తున్న బీజేపీ వైఖరికి మద్దతు పలుకుతారా అని మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఉద్దవ్ పై వ్యాఖ్యలు చేశారు. మరోవైపు, తృణమూల్ కాంగ్రెస్ కూడా మోడీని ప్రధానిగా అంగీకరించబోమని ప్రకటించింది. మోడీ అభ్యర్థిత్వానికి ఇప్పుడు, భవిష్యత్తులోనూ మద్దతిచ్చే ప్రశ్నే లేదని ఆ పార్టీ అధినేత మమతా బెనర్జి తేల్చి చెప్పారు.

ప్రధానమంత్రి మన్మోహన్ తీరును, ధరల పెరుగుదలను బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ తప్పుపడితే.. ఆర్థిక పరిస్థితిపై బిజెపి వ్యాఖ్యల్ని కేంద్రమంత్రి మనీష్ తివారీ తీవ్రంగా ఖండించారు. శుక్రవారం అచోచామ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజ్‌నాథ్‌సింగ్ మాట్లాడుతూ దేశంలో ధరలు పెరుగుతున్నాయ్, ఆర్థిక వ్యవస్థ పతనమవుతోంది.. ఈ పరిస్థితుల్లో దేశానికి కావల్సింది ఆర్థిక వేత్త కాదు, వాస్తవిక వాది అని అన్నారు.

ఆయన అంతా దేవుడి చిత్తానికి వదిలేశారని విమర్శించారు. కాగా ఇంగ్లీషు భాష భారత దేశ సంస్కృతిని దెబ్బతీస్తున్నదంటూ రాజ్‌నాథ్‌సింగ్ చేసిన వ్యాఖ్యలపై మనీష్ తివారీ మాట్లాడుతూ ఇంగ్లీషు తప్ప ఏ భాషా తెలియనివాళ్లు వారి సిద్ధాంత పత్రాన్ని తయారు చేస్తారని, వారేమో ఇంగ్లీషును తప్పుపడతారని అన్నారు. దేశం గణనీయ మైన ఆర్థికాభివృద్ధిని సాధిస్తున్నదని చెప్పారు.

English summary
Anti-graft crusader and veteran social activist Anna Hazare on Friday took a 180-degree turn and launched an attack on Gujarat Chief Minister Narendra Modi. The man said he had never praised Modi as the media had reported on Thursday and termed him a communal leader.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X