సమయం కాదు: చిన్నరాష్ట్రాలపై అఖిలేష్, బిర్యానీ ఇష్టం

చిన్న రాష్ట్రాల ఏర్పాటుపై స్పందించేందుకు, రాజకీయాలు మాట్లాడేందుకు సరైన సమయం కాదన్నారు. ఉత్తర ప్రదేశ్‌లో తాము దోపిడీకి పాల్పడుతున్న వారిపై దృష్టి సారించామని చెప్పారు. తమ రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిస్థాయిలో అదుపులో ఉన్నాయన్నారు. విద్యారంగంలో ఉత్తర ప్రదేశ్ అగ్రస్థానంలో ఉందన్నారు.
గుజరాత్ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార సారథి నరేంద్ర మోడీ సెక్యులర్ వాది కాదన్నారు. ప్రస్తుతం దేశమంతా సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ వైపు చూస్తోందన్నారు. యాదవులలో అవగాన పెరిగిందని చెప్పారు. యాదవులు విద్యా, ఉపాధి అవకాశాలు మెరుగుపర్చుకోవడం పైన దృష్టి సారించాలన్నారు.
దేశం అభివృద్ధి చెందాలంటే అందరూ చదువుకోవాలన్నారు. మెట్రో, వైద్య ఆరోగ్య రంగాలలో ప్రగతి సాధించవలసి ఉందన్నారు. అఖిల భారత యాదవ మహాసభకు హాజరుకావడం సంతోషంగా ఉందన్నారు. హైదరాబాదులోని ఆత్మీయులను కలవడం సంతోషంగా ఉందన్నారు. అన్ని వర్గాలను కలుపుకుపోవడం వల్లనే యుపిలో విజయం సాధించినట్లు చెప్పారు.
పార్టీల వారిగా వేరుగా ఉన్నప్పటికీ యాదవులు అనే సరికి అందరం ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. యాదవులు అన్ని రంగాలలో ముందుండాలన్నారు. హైదరాబాదు భోజనం ఎంతో రుచికరంగా ఉందన్నారు. హైదరాబాద్ బిర్యానీ అంటే తనకు ఎంతో ఇష్టమని చెప్పారు.












Click it and Unblock the Notifications