బాబు అడిగితే జగన్ ఓకే!: అవనిగడ్డ టిడిపి అభ్యర్థి హరి

ఈ నేపథ్యంలో అవనిగడ్డను ఏకగ్రీవం చేయాలని టిడిపి నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెసు పార్టీ ఏకగ్రీవానికి అంగీకరించినా.. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అంగీకరిస్తుందా? అనే ప్రశ్న తలెత్తింది. అయితే చంద్రబాబు కోరితే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా ఏకగ్రీవానికి సానుకూలంగా స్పందించే అవకాశాలు లేకపోలేదంటున్నారు. పోటీ లేకుండా ఏకగ్రీవానికి జగన్ అంగీకరించే అవకాశముందంటున్నారు.
టిడిపి అభ్యర్థి హరిబాబు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును సోమవారం అంబటి బ్రాహ్మణయ్య కుటుంబ సభ్యులు కలుసుకున్నారు. అంబటి బ్రాహ్మణయ్య కుమారుడు హరిబాబును అవనిగడ్డ ఉప ఎన్నికల బరిలో దింపనుంది. పార్టీ అభ్యర్థిగా హరిబాబును ఎంపిక చేశారు.
కాగా కృష్ణా జిల్లా అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి వచ్చే నెల 21న ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం షెడ్యూలు ప్రకటించింది. ఈ నెల 27న నోటిఫికేషన్ విడుదల అవుతుంది. నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చే నెల 3వ తేదీ చివరి గడువు. వచ్చే నెల 5న నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు 7వ తేదీ తుది గడువుగా సిఈసి ప్రకటించింది. వచ్చే నెల 21న పోలింగ్ కాగా 24న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఏకగ్రీవమైతే ఈ తంతు ఉండదు.












Click it and Unblock the Notifications