ఇంటి వద్ద భర్త శవం: ఓటేయడానికి వచ్చిన భార్య

కిటుముల పంచాయతీలోని భీమనాపల్లి గ్రామానికి చెందిన కొర్ర నర్సింహారావు అనే 40 ఏళ్ల వ్యక్తి మంగళవారం తెల్లవారుజామున అనారోగ్యంతో మరణించాడు. గ్రామంలోని అందరూ పోలింగుకు బయలుదేరి వెళ్లారు. నర్సింహారావు భార్య కొర్రా చిలుకమ్మ (38), ఆమె సోదరి లక్ష్మి, ఆమె భర్త రామారావు కలిసి ఓటేయడానికి నిర్ణయించుకున్నారు.
ఓటేసి వచ్చిన తర్వాత నర్సింహారావు అంత్యక్రియలు నిర్వహించాలని అనుకున్నారు. భర్త శవాన్ని ఇంటి వద్ద వదిలేసి ఐదు కిలోమీటర్ల దూరం నడిచి కిటుముల చేరుకుని చిలుకమ్మ ఓటేసింది. విషయం తెలిసి పోలింగ్ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఒక్క ఓటుతో విజయం
ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం మున్నంగివారి పాలెంలో సర్పంచిగా పోటీ చేసిన తెలుగుదేశం పార్టీ మద్దతుదారు చెరుకూరి నాగేశ్వర రావు ఒక్క ఓటుతో విజయం సాధించారు.
సర్పంచి అభ్యర్థి భార్యపై దాడి
కరీంనగర్ జిల్లా రామగుండం మండలం సోమనపల్లిలో సర్పంచి అభ్యర్థి భార్యపై ప్రత్యర్థులు దాడి చేశారు. గాయపడిన ఆమెను ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications