తెలంగాణ ఆత్మహత్యలో ట్విస్ట్, హత్యేనని పోలీసులు

Twist in BTech student suicide
మహబూబ్‌నగర్: బిటెక్ గ్రాడ్యుయేట్ వినోద్‌ది ఆత్మహత్య కాదని, హత్య అని పోలీసులు వెల్లడించారు. వినోద్‌ను గొంతు నులిమి హత్య చేసి, అనంతరం కాల్చి చంపినట్లు పోస్టుమార్టం నివేదికలో స్పష్టమైందని మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి సీఐ గిరిబాబు తెలిపారు.

సోమవారం మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్‌లో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. దుండగుల కోసం గాలిస్తున్నామని చెప్పారు. వినోద్‌ది హత్యేనని పోలీసులు ఎలాంటి విచారణ చేయకుండానే ప్రకటించడం సమంజసం కాదని ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు అన్నారు. కొల్లాపూర్‌లో ఆయన సోమవారం మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ కోసం మరో విద్యార్థి బలిదానం చేశాడు. మహబూబ్‌నగర్ జిల్లా వీపనగండ్ల మండలం కొండూరు గ్రామంలో ఇంజనీరింగ్ పట్టభద్రుడు నల్లపోతుల వినోద్‌కుమార్ (23) ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. 'జై తెలంగాణ .. నా చావుతోనైనా తెలంగాణ రావాలి, ఇట్లు వినోద్' అని పెన్నుతో రాసిన సూసైడ్ నోట్ లభ్యమైంది.

ఆదివారం మధ్యాహ్నం 3.30గంటల సమయం లో వినోద్ తన చిన్నాన్న ఇంటి వెనుక ఉన్న పశువుల పాకలో ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్నట్లు వార్తలు వచ్చాయి. మహబూబ్‌నగర్‌లోని జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో ఇటీవలే బీటెక్ పూర్తిచేశాడు. వినోద్ హైదరాబాద్‌లో తన అత్తమ దగ్గర ఉండేవాడని, చిన్నాన్న గోపాల్ సర్పంచ్‌గా పోటీ చేస్తుండడంతో ప్రచారం కోసం ఐదు రోజుల క్రితం గ్రామానికి వచ్చాడని కుటుంబ సభ్యులు చెప్పారు.

మధ్యాహ్న భోజనం చేసి వెళ్లాడని, కొద్దిసేపటికే ఆతహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు చెప్పారు. మృతుడి బ్యాగును, డైరీనీ, సూసైడ్‌నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన పోలీసులు వినోద్‌ది ఆత్మహత్య కాదని, హత్య అని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+