నోరు జారొద్దు: పార్టీ నేతలకు రాహుల్ గాంధీ హెచ్చరిక

గుజరాత్ అల్లర్ల వల్లే ఇండియన్ ముజాహిదీన్(ఐఎం) ఉగ్రవాద సంస్థ పుట్టిందన్న కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి షకీల్ అహ్మద్ వ్యాఖ్యల నేపథ్యంలో సోమవారం దేశం నలుమూలల నుంచి హాజరైన 200 మంది పార్టీ నేతల సమావేశంలో రాహుల్ ఈ విధంగా వ్యాఖ్యానించారు. కాగా, అహ్మద్ వ్యాఖ్యలతో పార్టీకి సంబంధం లేదని, అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని అధికార ప్రతినిధి రేణుకా చౌదరి పేర్కొన్నారు.
యూపిఏ, వివిధ రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాలు చేపట్టిన సంక్షేమ పథకాలపై నిజాలు ప్రచారంచేస్తే చాలని.. అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ వర్స్ షాప్ సందర్భంగా పార్టీ నేతలకు సూచించారు. అన్ని రాష్ట్రాల పార్టీ అధికార ప్రతినిధులు, మీడియా చర్చల్లో పాల్గొనే నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులకు నిర్వహిస్తున్న రెండు రోజుల వర్క్‌షాపును ఆయన సోమవారం ప్రారంభించారు.
మరోవైపు కాంగ్రెస్ వ్యాఖ్యలు పూర్తిగా అబద్ధమని, పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ సహకారంతోనే దేశంలో ఉగ్రవాద సంస్థలు పుడుతున్నాయని బిజెపి అధికారప్రతినిధి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ఉగ్రవాద సంస్థ సిమిని నిషేధించిన తర్వాత ఐఎం పుట్టుకొచ్చిందని తెలిపారు. బిజెపిని విమర్శించడానికి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదాన్ని సమర్థించేందుకు కూడా కాంగ్రెస్ వెనుకాడటం లేదని ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications